నటుడు మరియు రాజకీయ నాయకుడైన నారమల్లి శివ ప్రసాద్ గారు నేడు అకాల మరణం పొందిన విషయం తెలిసిందే.  శివ ప్రసాద్ గారు 11 జులై 1951లో చిత్తూరు జిల్లాలో జన్మించారు. ఇక తన బాల్యం మరియు విద్యాబ్యాసం అన్ని అక్కడే పూర్తి చేసిన శివ ప్రసాద్ గారు, ఎంబిబిఎస్ చదివిన అనంతరం డాక్టరు గా అక్కడే కొన్నాళ్ళు  వైద్య వృత్తిలో కొనసాగడం జరిగింది. అయితే అదే సమయంలో నటనపై మక్కువ ఏర్పడడంతో ,అప్పట్లో సినిమా రంగంవైపు అడుగులు వేసిన శివ ప్రసాద్ గారు, మెల్లగా అక్కడక్కడా సినిమాల్లో అవకాశాలు సంపాదించడం జరిగింది. ఆ విధంగా ఒక్కొక్కటిగా అవకాశాలతో ముందుకు సాగిన శివప్రసాద్ గారికి దర్శకత్వ శాఖపై ఆసక్తి ఏర్పడడంతో, 

మెల్లగా ఆ శాఖ పై కొంత పట్టు సాధించిన అనంతరం, తొలిసారి రాజేంద్ర ప్రసాద్, రోజాల కలయికలో ప్రేమ తపస్సు అనే సినిమాకు ఆయన దర్శకత్వం వచించారు. అయితే ఆ సినిమా అప్పట్లో పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక దాని అనంతరం కొంత విరామం తరువాత మళ్ళి అదే జంటతో ఒక వినూత్న కథాంశంతో టోపిరాజా స్వీటీరోజా అనే మరొక సినిమాకు దర్శకత్వం వహించగా అది కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఆ తరువాత మరింత గ్యాప్ తీసుకుని రాజ్ కుమార్ తో ఇల్లాలు, అలానే నూతన నటుడు శశి హీరోగా కొక్కొరొక్కో అనే సినిమాలు తీశారు. అయితే అవి రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేదు. 

ఇక అక్కడినుండి మళ్ళి సినిమాల్లోకి నటుడిగా కొనసాగిన శివ ప్రసాద్ గారికి, తన దర్శకత్వంలో ఒక మంచి హిట్ సినిమా చేయాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేదట. ఇక ఆ తరువాత రాజకీయాల్లో బిజీ అయి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా మంత్రిగా, ఇక ఇటీవల అదే పార్టీ తరపున ఎంపీగా కూడా గెలిచి ప్రజలకు సేవలందించిన శివ ప్రసాద్ గారిని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేరు. దర్శకుడిగా విజయవంతమైన సినిమాలు తీయలేనప్పటికీ, అద్భుతమైన నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎప్పటికీ మన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతారని అంటున్నారు సినీ విశ్లేషకులు. నేడు ఆయన అకాల మరణంపై పలువురు సినీ నటులు మరియు రాజకీయ నాయకులు నివాళులు అర్పిస్తున్నారు...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: