టాలీవుడ్ సినిమా రంగంలోకి మొదట నటుడిగా ప్రవేశించి, అక్కడాఅక్కడ కొన్ని సినిమాల్లో నటించి, ఆ తరువాత దర్శకుడిగా, ఆపై రాజకీయ నాయకుడిగా మన తెలుగు వారందరికీ ఎంతో సుపరిచితులైన శివ ప్రసాద్ గారు నేడు అకాల మరణం పొందారు. గత కొద్దిరోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న శివపరసాద్ గారిని, ఆయన కుటుంబసభ్యులు చెన్నై లోని అపోలో ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే కొన్నాళ్ల నుండి అక్కడి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న శివ ప్రసాద్ గారు, 

నేడు హఠాత్తుగా ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇకపోతే నటుడిగా తొలినాళ్లలో పలు సినిమాల్లో నటించిన శివప్రసాద్ గారు, తొలుత మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఫస్ట్ బిగ్ హిట్ అయిన ఖైదీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఆ తరువాత అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటించిన శివప్రసాద్ గారికి, 2005లో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ సినిమా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో గట్టయ్య అనే రాజకీయ నాయకుడిగా నటించిన శివ ప్రసాద్ గారు, ఎంతో అద్భుతమైన నటనను ప్రదర్శించడం జరిగింది. ఇక ఆ తరువాత నితిన్ హీరోగా 2008లో వచ్చిన ఆటాడిస్తా సినిమలో బోనాల శంకర్ అనే సినిమా, 

ఒక రకంగా ఆయన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ గా నిలిచి, అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమా తరువాత కుబేరులు, ద్రోణ, మస్కా, బ్రహ్మలోకం టూ యమలోకం వయా భూలోకం, తకిట తకిట, పిల్ల జమిందార్, అయ్యారే, దూసుకెళ్తా, సయ్యాట అనే సినిమాల్లో ఆయన నటించడం జరిగింది. అయితే 1999లో రాజకీయాల్లో ప్రవేశించిన శివప్రసాద్ గారు, తనకు మంచి గుర్తింపునిచ్చిన తెలుగు సినీ కళామతల్లిని, అలానే తెలుగు ప్రేక్షకులను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్తుంటారు. ఇక నేడు ఆయన అకాల మరణానికి చింతిస్తూ పలువురు ప్రజలు మరియు సినీ, రాజకీయ నాయకులు వారికి నివాళులు అర్పిస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: