టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.  కమెడియన్, విలన్ గా నటించిన తెలుగు ప్రేక్షకులను మెప్పించిన చిత్తూరు మాజీ ఎంపీ, నటుడు శివ ప్రసాద్ నేడు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. 1951 జూలై 11న చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం పులిత్తివారిపల్లి గ్రామంలో ఆయన జన్మించారు. 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. సమాచార, సాంస్కృతిక మంత్రిగా శివప్రసాద్ పని చేశారు. 2009, 2014లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలుపొందారు. పలు సినిమాల్లో నటించి, ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.


డాక్టర్‌గా, యాక్టర్‌గా, రాజకీయ నాయకుడిగా అన్నీ రంగాల్లో తనదైన ప్రతిభ ప్రదర్శిస్తూ... కమెడియన్‌గా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా శివప్రసాద్‌ ఎంతో పేరు తెచ్చుకుని ప్రేక్షకుల రివార్డులు, ప్రభుత్వ అవార్డులు ఎన్నో సంపాదించుకున్నారు.  ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడారు.  శివ ప్రసాద్ గారు మెడిసెన్ చేస్తున్న సమయంలో ఎన్నో కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని ప్రొఫెసర్స్ మెప్పు పొందారు.  అదే సమయంలో ఒకరోజు  ప్రముఖ నటుడు, దర్శకులు, నిర్మాత భారతీరాజా స్వయంగా శివప్రసాద్ ఇంటి తలుపు తట్టారు.

భారతీ రాజా  'పుదై వాళ్‌కైగళ్‌' తమిళ్‌లో, తెలుగులో కొత్త జీవితాలుతో చేశారు.  ఇదే శివ ప్రసాద్ మొదటి సినిమా... నూతనప్రసాద్‌గారి కాంబినేషన్‌లో ఆ సినిమా లో నటించారు. తర్వాత నూతనప్రసాద్‌   'ఓ అమ్మ కథ' సినిమా తీశారు..ఆ సమయంలో సినిమాలు వొద్దు అనుకుంటున్న శివ ప్రసాద్ ని ఇందులో నటింపచేశారు.  ఈ సినిమాల తర్వాత వెంటనే 17 ఆఫర్లు వచ్చాయి..కానీ ఇంట్లో సినిమాలు వద్దు..ప్రొఫెషన్ మానేస్తే తర్వాత ఇబ్బందుల్లో పడతారని ఇంటి సభ్యులు అనడంతో..మళ్లీ ఆలోచనలో పడ్డారు శివప్రసాద్.

ఆ సమయంలో ఆయన గురువు  సినిమాల్లో వేషం వచ్చేది చాలా కష్టం. అలాంటిది నువ్‌ ప్రయత్నం చేయకుండానే నీకు అదృష్టం కలిసొచ్చింది. సినిమాలు చేయి అన్నారు. ఆ తర్వాత   ఖైది'లో కోదండ రామిరెడ్డి నాకు, సుత్తివేలుకి ఫ్రీడం ఇచ్చారు. సీన్లు చెప్పి కంటెంట్‌ ఇది. మీరు ఏమి డెవలప్‌ చేసుకుని చేస్తారో చెయ్యండి అన్నారు. పాటలు, కామెడీ బిట్స్‌ ఎన్నో చేశారు.  1993లో 'కొక్కొరకో' అనే ఒక సినిమా చేశాను. 1995లో 'టోపీ రాజా స్వీటీ రోజా' 1997లో 'ఇల్లాలు' సినిమాలు తీశాం. 1998లో రాజకీయంగా నా కెరీర్‌ మలుపు తిరిగిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు శివ ప్రసాద్. 


మరింత సమాచారం తెలుసుకోండి: