బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో 9వ వారం బిగ్ షాక్ ఇచ్చాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ సర్ ప్రైజ్ చేశాడు. ఈ వారం నామినేషన్స్ లో రాహుల్, హిమజ, రవి కృష్ణ ఉండగా నాగార్జున వచ్చి ఈ వారం డబుల్ నామినేషన్ అని చెప్పాడు. ఇక ప్రోమోలో రాహుల్ ఎలిమినేట్ అయినట్టుగా చూపించారు.


ఈ వారం నామినేషన్ ప్రక్రియలో టెలిఫోన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంటి సభ్యులు బిగ్ బాస్ చెప్పింది సాక్రిఫైజ్ చేయించాల్సి ఉంటుంది. అయితే వీరిలో మహేష్ కోసం హిమజ తన బట్టలు, మేకప్ కిట్ స్టోర్ రూంలో పెట్టాల్సింది కాని కొన్ని మర్చిపోవడం వల్ల మహేష్ నామినేట్ అయ్యాడు. ఇక రాహుల్ కోసం పునర్నవి ఈ వారం కాకుండా నెక్స్ట్ వీక్ నుండి సీజన్ మొత్తం నామినేట్ అవ్వాలి అందుకు పునర్నవి ఒప్పుకున్నా రాహుల్ ఒప్పుకోకుండా నామినేట్ అయ్యాడు.   


ఇక హిమజ కోసం వరుణ్ తేజ్ పేడ తొట్టిలో ఉన్నా సరే కెప్టెన్ గా తన పవర్ ను ఉపయోగించి ఒకరిని నామినేట్ చేయమని బిగ్ బాస్ ఆదేశించగా హిమజని నామినేట్ చేసింది. సో అలా ముగ్గురు నామినేట్ అవగా ఈ వారం ఆ ముగ్గురిలో ఎలిమినేట్ అయ్యే ఆ ఒక్కరు ఎవరు అనుకున్నారు. కాని అనుకున్నది జరిగితే అది బిగ్ బాస్ ఎందుకు అవుతుంది అందుకే బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్స్ ప్లాన్ చేశాడు.   


ఆల్రెడీ రాహుల్ ఎలిమినేట్ అయినట్టుగా చెబుతున్నారు మరి ఆ రెండో ఎలిమినేషన్ హిమజ అవుతుందా లేక మహేష్ అవుతాడా అన్నది ఆదివారం తెలుస్తుంది. బిగ్ బాస్ ఇచ్చిన ఈ బిగ్ సర్ ప్రైజ్ తో కంటెస్టంట్స్ తో పాటుగా ఆడియెన్స్ కూడా షాక్ అయ్యారు. ఇక ఉన్న వారిలో వరుణ్ సందేష్, బాబా భాస్కర్, రవి కృష్ణలు టాప్ 3లో ఉండగా ఆ తర్వాత శివ జ్యోతి, శ్రీముఖిలు టాప్ 5లో ఉన్నారని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: