మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇంతకాలంగా చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వరుణ్ మొదటి సినిమాతోనే హీరో మెటీరియల్ అని అనిపించుకున్నాడు. అంతేకాదు మెగా హీరోలకు ఏమాత్రం తీసిపోడని ఆ సినిమాతోనే ప్రూవ్ చేసుకోవడమేకాదు మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇక కంచె సినిమాతో క్లాస్ హీరోగా మంచి సక్సస్ ను అందుకోవడమే కాదు అంతరిక్షం, తొలిప్రేమ, ఎఫ్ 2 సినిమాలతో ఆ సక్సస్ రేంజ్ ను మరింతగా పెంచుకున్నాడు. అయితే ఇవన్ని కూడా అందరు హీరోలు సాధారణంగా చేసే క్లాస్ సినిమాలే. అయితే వరుణ్ ని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మాస్ హీరోగా ఏ సినిమాలోను చూడలేదు. అలా చూపించాలన్న ఆలోచన ఏ డైరెక్టర్ కి రాలేదు. అదే గద్దలకొండ గణేష్ గా వరుణ్ ని నిలబెట్టింది. 

దువ్వాడ జగన్నాథం సినిమా తర్వాత హరీష్ శంకర్ తమిళ సినిమా జిగర్తాండా కు రీమేక్ గా తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ ముందు నుంచి ఎంత హైప్ క్రియోట్ అయిందో అందుకు ఏమాత్రం తగ్గకుండా మొదటి షో పడ్డ దగ్గర్నుంచే హిట్ టాక్ ని తెచ్చుకొని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కలెక్షన్స్ పరంగా కూడా మొదటి రోజు మంచి వసూళ్ళను రాబట్టింది. దీన్ని బట్టి చూస్తే ఈ సోమవారం వరకు థియోటర్స్ అన్ని హౌజ్ ఫుల్ రన్ తో ఇంకా కలెక్షన్స్ బాగా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు వరుణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని రాబట్టిన సినిమాగా కూడా రికార్డ్ క్రియోట్ చేయడం పక్కా అని తెలుస్తోంది.  

మొదటిసారి వరుణ్ కొత్తగ్గా ట్రై చేసిన గద్దలకొండ గణేష్ క్యారెక్టర్, మేకోవర్ వరుణ్ టాప్ టెన్ సినిమాలలో ఉండటం ఖాయమని ఫిక్సైపోవచ్చు. ఇక ఇప్పటివరకు వరుణ్ చేసిన సినిమాలన్ని ఒకటైతే ఈ ఒక్క సినిమానే ఒకటని మెగా ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం వరుణ్ సినిమా ఎఫెక్ట్ నాని గ్యాంగ్ లీడర్ మీద గట్టిగానే పడింది. ఇక ఈ రెండు వారాలు వరుణ్ ని అడ్డుకునే వాళ్ళు ఎవరు దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు కాబట్టి సైరా వచ్చే వరకు గద్దలకొండ గణేష్ కి మంచి కలెక్షన్స్ రావడం కాదు వరుణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమా కూడా ఇదే అవుతుందనడంలో సందేహం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: