నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా డిఫరెంట్ కథ కథనాలతో వచ్చింది. నానితో పాటుగా సీనియర్ నటి లక్ష్మి, శరణ్య నటించారు. సినిమాలో హీరోయిన్ గా ప్రియాంకా అరుళ్ మోహన్ నటించారు.


సెప్టెంబర్ 13న రిలీజైన నాని గ్యాంగ్ లీడర్ సినిమా మొదటి షో నుండి హిట్ టాక్ తెచ్చుకుంది. నాని మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక సినిమాలో నాని నటనకు మరోసారి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కొత్త అమ్మాయి ప్రియాంకా మోహన్ కూడా తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. 


మొదటి వారం సక్సెస్ ఫుల్ గా రన్ అయిన గ్యాంగ్ లీడర్ శుక్రవారం వరకు 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. సినిమా థియేట్రికల్ బిజినెస్ 29 కోట్లు కాగా డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా భారీగానే వెళ్లాయి. ఈ ఇయర్ ఆల్రెడీ జెర్సీతో హిట్ అందుకున్న నాని గ్యాంగ్ లీడర్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.


ఇక ఈ సినిమా తర్వాత నాని వి సినిమా చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. నాని గ్యాంగ్ లీడర్ లో యువ హీరో కార్తికేయ విలన్ గా నటించి మెప్పించాడు. ఆరెక్స్ 100తో లైం లైట్ లోకి వచ్చిన కార్తికేయ తనకు వచ్చిన ఛాన్స్ పర్ఫెక్ట్ గా వాడుకున్నాడని చెప్పొచ్చు. చూస్తుంటే కార్తికేయకు తెలుగులో మంచి ఫ్యూచర్ ఉందనిపిస్తుంది. ఇలా గ్యాంగ్ లీడర్ తో వచ్చాడో లేదో కార్తికేయ తను హీరోగా చేస్తున్న 90 ML మూవీ టీజర్ ఈరోజు రిలెజ్ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: