మెగాస్టార్ సైరా సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకుంది.  సైరా సినిమా కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కింది.  బ్రిటిష్ దొరలపై పోరాటం చేసిన తొలి తెలుగు వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు.  అయితే అయన చరిత్ర గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు.  ఉయ్యాలవాడ కుటుంబీకులు ఇప్పటికి కర్నూలు జిల్లాలో ఉన్నారు. ఈ సినిమా తీయాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా వారి నుంచి అనుమతి తీసుకోవాలి.  


ఇక అయన జీవితం గురించి పరిశోధన చేయాలి అంటే ఆయా కుటుంబాలను తప్పనిసరిగా కలవాలి.  వారి అనుమతులు తీసుకోవాలి.  వారి కథను వాడుకుంటున్నారు కాబట్టి దానికి తగిన సహాయ సహకారాలు అందించాలి.  బాలీవుడ్ లో సంజు కథను తీసుకున్నప్పుడు అలాగే చేశారు.  ఒక్క సంజునే కాదు.. బయోపిక్ సినిమా అంటే తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలి.  చరిత్రలో బాగా తెలిసిన వ్యక్తుల జీవితాల గురించి సినిమా తీసే సమయంలో ఇవి వర్తించవు.  


నిర్మాత రామ్ చరణ్, దర్శకులు, మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ కుటుంబానికి అప్పట్లో హామీ ఇచ్చారట.  ఆదుకుంటామని, సినిమా ద్వారా సహాయం చేస్తామని చెప్పారట.  ఆ కాలానికి చెందిన వస్తువులను కూడా సెట్స్ కోసం వాడుకున్నారని ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.  చాలాసార్లు ఈ విషయంపై చరణ్, మెగాస్టార్ లను అడిగితె.. స్పందించలేదని, ఉయ్యాలవాడ కుటుంబానికి చెందిన 23 మంది బంధువులు ఉన్నారని, వారికీ రూ. 50 కోట్ల రూపాయల వరకు సహాయం చేస్తామని చరణ్ హామీ ఇచ్చారని కానీ దానిగురించి ఇప్పుడు మాట్లాడటం లేదని వాపోతారు.  


ఈరోజు ఉయ్యాలవాడ కుటుంబీకులు, వంశస్తులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సైరా ఆఫీస్ కు వెళ్తే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోయారు.  నిన్నటిరోజున సైరా యూనిట్ ను కలిసి ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోండి అని సమాధానం ఇచ్చారని 23మంది కుటుంబీకులు పేర్కొన్నారు.   చేయాలని పోలీస్ స్టేషన్ కు వచ్చినట్టు వారు పేర్కొన్నారు.  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ దొరలపై పోరాటం చేస్తే.. తమకు న్యాయం జరిగే వరకు సైరా యూనిట్ పై పోరాటం చేస్తామని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: