క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. ఈ సినిమాను ఫిలిమ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా క‌మిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ చిత్రంతో పాటు మ‌రో 28 చిత్రాల‌ను  ఈ లిస్టులోకి ఎంపిక‌య్యాయి. ఈ చిత్రాల‌న్నింటినీ స్క్రీనింగ్ చేసే వాటిలో మంచి చిత్రాన్ని ఎంపిక చేసి ఓ చిత్రాన్ని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేట‌గిరీలో ఆస్కార్‌కి పంపుతారు.


డియ‌ర్ కామ్రేడ్‌` మాత్ర‌మే ఈ లిస్టులోకి ఎన్నికైన ఏకైక తెలుగు చిత్రం. ప్ర‌స్తుతం స్క్రీనింగ్ జ‌రుగుతుంది. వీటిలో బెస్ట్ మూవీని ప్ర‌క‌టిస్తారు. ప్ర‌ముఖ ఫిలిం మేక‌ర్ అప‌ర్ణ సేన్ అధ్య‌క్ష‌త‌న ఈ జ్యూరీ ప‌ని చేస్తుంది. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీమూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ బ్యాన‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.


భారీ అంచనాలతో వచ్చిన డియర్ కామ్రేడ్‌ ఊహించని విధంగా డిజాస్టర్ అయిపోయింది. నాలుగు భాషల్లోనూ దారుణంగా ఫ్లాప్ కావడంతో విజయ్ దేవరకొండకు పెద్ద షాక్. భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. అంతా మరిచిపోయి కొత్త సినిమాతో బిజీ అవుతున్న సమయంలో డియర్ కామ్రేడ్ సినిమా ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. విజయ్ ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో క్రాంతి మాధవ్ సినిమా కూడా ఒకటి. వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ వస్తున్నాడు విజయ్. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేయస్ రామారావు నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఇప్పుడు ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇది చూసిన తర్వాత ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోవడం ఖాయం. అంతగా మారిపోయాడు ఈ హీరో. వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిలే క్రేజీగా ఉంది. ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: