మంచు లక్ష్మీ ఇది వరకే మెగాస్టార్ నుండి యంగ్ హీరో హీరోయిన్స్ దాకా అందరిని తన టాక్ షోకి పిలిచి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులకు తెలియజేశారు. ఈ టాక్ షో ఎంత పెద్ద సక్సస్ అయిందో అందరికి తెలిసిందే. ఒకరకంగా యాంకర్ కం నటుడు ప్రదీప్ మాచిరాజు నిర్వహిస్తున్న తన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమానికి కూడా లక్ష్మీ'స్ టాక్ షో నే ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇక మరో సీజన్ తో వస్తున్న మంచు లక్ష్మీ సెలబ్రిటీల పడక గది రహస్యాల్ని ఓపెన్ గా చెప్పించబోతున్నారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ప్రారంభంలోనే టాప్ సెలబ్రిటీలకు సంబంధించిన పడక గది రహస్యాల్ని రివీల్ చేయిస్తూ షాకివ్వబోతున్నారు.  

లక్ష్మీ టాక్ షో లో ఈ వారం అక్కినేని కోడలు సమంత బెడ్ రూమ్ సీక్రెట్స్ గురించి ఓపెన్ గా చెప్పించడం ఆసక్తికరంగా మారింది. ఈ ఎపిసోడ్ లో చైతన్య- సమంత జంట పడక గదికి సంబంధించిన చాలా సీక్రెట్స్ ని ఓపెన్ గా చెప్పారు. బెడ్ రూమ్ లో ఎవరికీ తెలియని సీక్రెట్స్ ని బోలెడన్ని ప్రశ్నలు వేసి లక్ష్మీ మంచు చెప్పించారు.అందులో భాగంగానే చైతన్యకు తలగడ మొదటి భార్య. తనని ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలనుకున్నా మా ఇద్దరి మధ్యలో అది అడ్డొస్తోంది.. అంటూ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పింది సామ్. కొందరికే తెలిసి చాలామందికి తెలియని రహస్యాన్ని లక్ష్మీ టాక్ షో రివీల్ చేసేస్తోందని దీన్ని బట్టి అర్థమవుతోంది. చైతన్య- సమంత సహజీవనం గురించి పరిశ్రమ వ్యక్తులకు మీడియా వరకూ తెలియొచ్చు ఇప్పటివరకూ. ఈ ఎపిసోడ్ చూశాక ప్రతీ ఒక్కరికి తన పర్స్నల్ విషయాలన్ని తెలియనున్నాయి. 

ఇక నాగ చైతన్య-సమంత, గౌతం మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతోనే ప్రేమలో పడ్డ విషయం అందరికి తెలిసిందే. అంతేకాదు ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం సినిమాలలోను కలిసి నటించారు. ఇక పెళ్ళి చేసుకున్నాక మొదటి సారి కలిసి నటించిన మజిలీ సినిమా ఇద్దరికి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చింది. ఈ సినిమా సక్సస్ తో ఇద్దరు కలిసి మళ్ళీ మళ్ళీ నటించాలని అనుకుంటున్నారు. అందుకనే తమ దగ్గరకు వస్తున్న దర్శకులకు మజిలీ వంటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఉన్న కథలను తయారు చేయమని చెపుతున్నారని తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: