టాలీవుడ్ లో అష్టాటాలీవుడ్ లో అష్టాచమ్మ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాని తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేదు.  అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎవడే సుబ్రమాణ్యం’ సినిమాతో మంచి విజయం అందుకున్న నాని తర్వాత మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత వరుస విజయాలతో దుమ్మురేపాడు.  అప్పటి వరకు నాని ఓ చిన్న నటుడిగానే ట్రీట్ చేసే దర్శక, నిర్మాతలు నాని వరుస హిట్స్ తర్వాత ఆయన ఇంటికి క్యూ కట్టారు.  టాలీవుడ్  లో మినిమం గ్యారెంటీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. 

ఈ సంవత్సరం జెర్సీతో మరో విజయం అందుకున్న విక్రమ్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్ ’ తో మరో సెన్సేషన్ విజయం అందుకున్నాడు. అయితే భలే భలే మగాడివోయ్ హిట్ తర్వాత వరుస విజయాలు అందుకున్న నాని  విజయపరంపరకు బ్రేకులు వేసిన మూవీ కృష్ణార్జున యుద్ధం. అది ఒక రిజెక్టెడ్ స్టోరీ. దర్శకుడు మేర్లపాక గాంధీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఈ కథ రాసుకున్నాడు. అయితే వరసగా సిట్టింగ్స్ అవుతున్నా కథలో క్లారిటీ రాకపోవడంతో రామ్ చరణ్ సైడైపోయాడు.  అయితే ఈ మూవీపై నమ్మకంతో నాని ఓకే అనడం అప్పట్లో పలు కామెంట్స్ కూడా వినిపించాయి. అప్పటికి నానిపై ఉన్న ఇమేజ్ విజయాన్ని అందిస్తుందన భావించారు..కానీ అది ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు మళ్ళీ దాదాపు ఇదే తప్పు చేయబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.   

విక్రమ్ కుమార్, అల్లు అర్జున్ కోసం గ్యాంగ్ లీడర్ కథ రాసుకున్నాడు. అల్లు అర్జున్ కు కథ నచ్చినా, సెకండ్ హాఫ్ పై అభ్యంతరం వ్యక్తం చేసాడు. విక్రమ్, అల్లు అర్జున్ మధ్య ఆలోచనల్లో సారూప్యం కనపడకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు ఈ మూవీలో సెకండ్ హాఫ్ ప్రధాన కంప్లైంట్ అని అందరూ అంటున్నారు. ఫలితం నాని ఖాతాలో మరో ప్లాప్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇలాంటి తప్పిదాలు గతంలో పలు హీరోలు చేశారు.  మహేష్ కెరీర్ లో అతడు, పోకిరి, రవితేజ కెరీర్ లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్.. ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదవుతుంది. ఈ చిత్రాలన్నీ సూపెర్ హిట్స్ అయినవే. కానీ ఇక్కడ నానికి మాత్రం రిజెక్టెడ్ స్టోరీస్ చేదు అనుభవాలని మిగుల్చుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: