బిగ్ బాస్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులరిటీ రియాలిటీ షో. రెండు సీజన్లు పూర్తి చేసుకుని మూడో సీజన్ కొనసాగుతోంది. నాగార్జున హోస్టుగా రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే  ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఆ సమయం రానే వచ్చేసింది. ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉందంటూ నాగార్జున చెప్పే సరికి అందరు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఎందుకంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశాడు బిగ్ బాస్ అని. వీకెండ్‌లో రెండు రోజులు నాగార్జున వస్తాడు కాబట్టి ఒక్కోరోజు ఒక్కరిని ఎలిమినేషన్ చేయవచ్చని ఆలోచనతో ఈ రోజు ఒకరిని బయటకు పంపిస్తారంటూ నాగార్జున చెప్పేశారు. ఆ కంటెస్టంటే ఎవరో కాదు రాహుల్ అంటూ నాగార్జున పేరును రిలీజ్ చేశాడు. అయితే అసలైన షాక్ ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.  తాజాగా విడుదలైన ప్రోమోలో తొలిరోజు ఎలిమినేట్ అయ్యేది రాహుల్ అని తెలిసిపోయింది. ఈ వారం రాహుల్, మహేష్, హిమజ నామినేషన్స్‌లో ఉండగా, అందులో శనివారం రోజు రాహుల్ ఎలిమినేషన్ అయ్యాడని నాగార్జున చెప్పేశాడు. దీంతో హౌస్ లో  ఉన్నవాందరు షాకయ్యారు. అయితే అందరు కూడా మహేష్ ఎలిమినేషన్ అవుతాడని భావించారు. కానీ అందుకు రివర్స్ జరిగిందని ఆశ్చర్యపోయారు. ఈ శనివారం కానీ రాహుల్ సిప్లిగంజ్‌ ఎలిమినెట్ అయ్యాడని నాగార్జున చెప్పేయడంతో రాహుల్ అందరితో ఫోటో సెల్ఫీ దిగి  స్టేజీ పైకి వచ్చేశాడు. రాహుల్ ఎలిమినేషన్‌తో పునర్నవి కూడా ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇక రాహుల్ స్టేజిపైకి రాగానే ఇక ఇప్పుడు ఎవర్ని తిట్టాలి సర్ నేను అంటూ ఏడ్చేసింది. తనలో తాను కుమిలిపోయింది. నాకు చాలా మంచి మిత్రుడని చెప్పుకొంటూ కన్నీరు పెట్టుకుంది పునర్నవి. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో హిమజ, మహేష్ నామినేషన్స్‌లో ఉన్నారు. హిమజ బయటికి వచ్చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చివరిలో బిగ్ బాస్ అసలైన షాకిచ్చాడు. రాహుల్ స్టేజిపైకి వచ్చాక, ఇంటి సభ్యులందరితో మాట్లాడించిన తర్వాత అసలు రాహుల్ ఎలిమినేషన్ కాలేదని, ఇదంతా బిగ్ బాస్ ఆడించిన గేమ్ అని, రాహుల్ మళ్లీ హౌస్ లోకి వెళ్తారని ప్రేక్షకుల ముందు చెప్పాడు నాగార్జున. దీంతో స్టేజి ముందున్న ప్రేక్షకులే కాకుండా టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ విషయం హౌస్ లో ఉన్న కంటెస్టంట్ కు మాత్రం తెలియదు. మరి రాహుల్ ను హౌస్ లోకి ఎప్పుడు పంపిస్తారో, మళ్లీ రాహుల్ హౌస్ లోకి వెళ్లగానే ఇంటి సభ్యులందరూ ఎలా రియాక్టు అవతారో తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: