ఒక సినిమా అన్నది ఎక్కడ పుడుతుంది అంటే అది కచ్చితంగా డైరెక్టర్ మెదడు నుంచే అని చెప్పాలి. ఎందుకంటే మొదట సినిమా చూసేదే డైరెక్టర్. ఆయన తన కధకు ఆర్టిస్టులను ఎంచుకుంటాడు. అలాగే వారి నుంచి తనకు అనుకూలంగా నటనను రాబట్టుకుంటాడు. ఇవన్నీ అందరికీ తెలిసిందే.


ఇక క్రియేటివ్ డైరెక్టర్లు కొంతమంది సినిమాల్లో పాటలు కూడా ఎలా ఉంటాయన్నది తామే దగ్గరుండి చేయించుకుంటారు. కొరియోగ్రఫీ తెలిసిన డైరెక్టర్లు ఆ సాంగ్స్ లో పూర్తి ఇన్వాల్వ్ అవుతారు. అటువంటి డైరెక్టర్లలో అతి ముఖ్యుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ఆయన సినిమాల్లో పాటలు చాలా అందంగా ఉంటాయని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.


అటువంటి దర్శకుడు రాఘవేంద్రరావు ద్రుశ్ర్యకావ్యంగా దేవత సినిమాను చెప్పుకుంటారు. ఈ మూవీ నుంచి ఎల్లువచ్చి గోదారమ్మ సాంగ్ ఇప్పటికీ పాపులర్. ఆ సాంగ్ రాజమండ్రీ గోదావరి తీరంలో తీశారు. శోభన్ బాబు, శ్రీదేవి ఆ  సాంగ్ కి ప్రాణం పోశారు. ఇపుడు అదే సాంగ్ ని వాల్మీకి మూవీలో రీమిక్స్ చేశారు.


ఈ మూవీలో వరుణ్ తేజ్, పూజా హెగ్డె ఈ సాంగ్ చేస్తారు. హరీష్ శంకర్ ఈ సాంగ్ ని తన మూవీలో పెట్టుకోవడమే పెద్ద మ్యాజిక్. ఆయన రాఘవేంద్రుని అభిమాని. పైగా ఈ సాంగ్ అంటే ఇష్టంతో పెట్టాడు. దాని మీద దర్శకేంద్రుడు ప్రశంసలు కురిపించారు. 


తన సాంగ్ కి మళ్ళీ న్యాయం జరిగిందని ఆయన చెప్పడం ఓ ప్రశంసే.  వరుణ్ తేజ్. పూజా హెగ్డే బాగా చేశారని కూడా ఆయన చెప్పడమూ విశేషమే. ఓ క్రియేటర్ తన సాంగ్ ని మరో క్రియేటర్ తీస్తే చూసి బాగుందని చెప్పడం గొప్ప విషయంగానే చూడాలి.  ఆ సంస్కారం రాఘవేంద్రరావులో పుష్కలంగా ఉంది కాబట్టే ఆయన గ్రేట్ డైరెక్టర్ అయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: