బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో ఈ శనివారం ఆడియెన్స్ ను ఫూల్స్ ను చేస్తూ బిగ్ బాస్ ఓ ఫేక్ ఎలిమినేషన్ నిర్వహించాడు. ఈ వారం హిమజ, రాహుల్, మహేష్ నామినేషన్స్ లో ఉండగా రాహుల్ ను ఎలిమినేట్ అంటూ నాగార్జున షాక్ ఇచ్చాడు. అయితే ఇంట్లో సభ్యులతో సెల్ఫీ దిగి ఇంటి నుండి బయటకు వచ్చి నాగార్జునను కలిసిన రాహుల్ కు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్.        


ఇంటి సభ్యులతో మాట్లాడిన తర్వాత రాహుల్ కు వాళ్లందరి చేత బై చెప్పించి మళ్లీ హౌజ్ లోకి పంపించాడు నాగార్జున. సో రాహుల్ ది ఫేక్ ఎలిమినేషన్ అన్నమాట. మళ్లీ హౌజ్ లోకి వెళ్లిన రాహుల్ బిగ్ బాస్ చెప్పేదాకా ఇంటి సభ్యులకు కనబడకుండా సీక్రెట్ హౌజ్ లో ఉంటాడు.   


బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేసినప్పుడు కూడా ముమైత్ ఖాన్ ను ఇలానే ఎలిమినేట్ చేసి సడెన్ గా తారక్ పిలిచి నువ్వు అప్పుడే వెళ్తే ఎలాగంటూ ఆమెను సీక్రెట్ రూంలోకి పంపించాడు. అయితే సెకండ్ సీజన్ లో ఇలాంటిది చేయలేదు. ఇక రాహుల్ నే ఎందుకు అంటే సింగర్ గా రాహుల్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకోగా హౌజ్ లో పునర్నవితో అతని రిలేషన్ బిగ్ బాస్ కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది.    


ఎలిమినేషన్స్ లో కూడా పునర్నవి రాహుల్ ను ఎంతగానో మిస్ అవుతున్నట్టుగా వెళ్లడించింది. రాహుల్ కోసం పునర్నవి కన్నీళ్లు పెట్టుకుంది. ఫైనల్ గా ఈ వారం ఇద్దరు ఎలిమినేషన్ అని చెప్పిన నాగ్ అందులో ఒకటి ఫేక్ ఎలిమినేషన్ అని హౌజ్ మెట్స్ కనిపెట్టలేకపోయారు. మరి రాహుల్ హౌజ్ లో రీ ఎంట్రీ ఎలా ఉంటుంది.. రాహుల్ ను చూసి పునర్నవి, వరుణ్ సందేష్ లు ఎలా ఫీల్ అవుతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: