ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వంశీయుల గొడవ రోజు రోజుకు ముదురుతుంది.చిరంజీవి హీరోగా తెరకెక్కిన‘సైరా’సినిమా కథ విషయంలో తమతో ఒప్పందం చేసుకొని మోసం చేశారని ఆరోపిస్తూ,మెగాస్టార్ చిరంజీవి,రామ్‌ చరణ్‌పై ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు నరసింహా రెడ్డి వంశీయులు ఈ కథను తమ నుంచి సేకరించి, తిరిగి తమపైనే తప్పుడు కేసులు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు.తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఎన్నోసార్లు రామ్ చరణ్‌ను,సినిమా దర్శకుడిని కలిశామని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు చెప్తుతున్నారు.అయినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నిసార్లు చిత్ర యూనిట్‌ను కలిసిన..ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని నిర్లక్ష్యంగా మాట్లాడారని..చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించామని చెప్పారు.



ఈ సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబానికి చెందిన 23 మంది బంధువులను సినిమా యూనిట్ గుర్తించినట్లు ఆ వంశస్థులు చెబుతున్నారు.సినిమా ప్రారంభ సమయంలో తమకు న్యాయం చేస్తామని డైరెక్టర్,ప్రొడ్యూసర్ మాట ఇచ్చారని 23 మందికి కలిపి రూ.50 కోట్లు ఇస్తామని చిత్ర యూనిట్ చెప్పినట్లు వెల్లడించారు.సినిమా ప్రారంభానికి ముందు కథను తీసుకుంటున్నందుకు డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేశారని వాపోతున్నారు.ఇక ఉయ్యాలవాడ కుటుంబ సభ్యుల ధర్నా విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ..సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 100 ఏళ్ల తర్వాత ఓ వ్యక్తి జీవితం చరిత్ర కిందకు వెళ్లిపోతుంది.దాన్ని సినిమాగా ఎవరైనా వాళ్ల గౌరవానికి భంగం కలగకుండా తెరకెక్కించవచ్చని చెప్పుకొచ్చారు.మంగళ్ పాండే జీవిత చరిత్రను తెరకెక్కించేటపుడు చరిత్రలో 65 ఏళ్ల లిమిట్ ఉంటే చాలని సుప్రీంకోర్డు తీర్పు చెప్పింది.మరి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి..దేశం కోసం ఉయ్యాలవాడ అనే ప్రాంతం కోసం పోరాడారు.



ఏమైనా సాయం చేయాలంటే ఆ ఊరు కోసమో..జనాల కోసమో చేస్తాను.నలుగురు వ్యక్తులకో కుటుంబానికో మాత్రం సపోర్ట్  చేయను.అలా చేసి మహాత్ముడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్థాయిని తగ్గించనని తెలిపారు..స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న‘సైరా’చిత్రంపై కొంత కాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఆక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడానికి అన్ని హంగులతో ముస్తాబవుతున్న ఈ సినిమా పై ఇంతలా  నరసింహారెడ్డి వంశీయులు దుమారం రేపడానికి కారణం ఏంటో ఎవ్వరికి అర్ధం కావడం లేదు.ఇందులో వున్న గూడుపుఠాని నరసింహా రెడ్డి వంశస్తులకు,చిత్రయూనిట్‌కు మాత్రమే తెలుసు అనుకుంటున్నారు సిని జనాలు.  


మరింత సమాచారం తెలుసుకోండి: