ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన సినిమా సాహో. ఆగస్టు నెల 30వ తేదీన విడుదలైన ఈ సినిమాపై విడుదలకు ముందు భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ సాహో సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు 300 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. శాటిలైట్, డిజిటల్ హక్కులతో మరో 100 కోట్ల రూపాయలు వచ్చాయని సమాచారం. 
 
ఈ సినిమాను ప్రభాస్ స్నేహితులైన ప్రమోద్ మరియు వంశీ నిర్మించారు. సినిమాకు భారీ బడ్జెట్ కావటంతో ప్రభాస్ కు రెమ్యూనరేషన్ సినిమా విడుదలైన తరువాత ఇవ్వాలని నిర్మాతలు భావించారు. ప్రభాస్ కూడా అందుకు అంగీకరించాడు. కానీ సినిమా విడుదలైన తరువాత హిందీ మినహా మిగతా భాషల్లో సాహో సినిమాకు 80 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నష్టాలు తీర్చటం కొరకు సాహో నిర్మాతలు అప్పు చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. 
 
సినిమాకు భారీగా నష్టాలు రావటంతో ప్రభాస్ కు ప్రస్తుతం రెమ్యూనరేషన్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ప్రభాస్ నిర్మాతలకు నష్టాల్లో కొంత మొత్తం సహాయం కూడా చేస్తున్నాడని సమాచారం అందుతుంది. రెమ్యూనరేషన్ తీసుకోకుండా నిర్మాతలకు నష్టాల్లో సహాయం చేస్తూ ఉండటంతో ప్రభాస్ గురించి ఇండస్ట్రీకి చెందిన వారు ప్రభాస్ చాలా గ్రేట్ అని అనుకుంటున్నారట. 
 
సాహో సినిమా హిందీ భాషలో మాత్రమే లాభాలను మిగిల్చింది. బాలీవుడ్ లో ఈ సినిమాకు 153 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 125 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా 85 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. తమిళనాడు, కేరళలో కూడా సాహో సినిమాకు భారీగా నష్టాలు వచ్చాయని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: