వైసీపీ సర్కార్ ఏర్పాటు అయిన తరువాత పాలనాపరంగా దూకుడు ప్రదర్శిస్తూ వస్తోంది. ముఖ్యంగా రాజకీయ వ్యాపకాలతోనే ఆ పార్టీకి పొద్దు గడుస్తోంది. ఇక సినిమాలు, ఇతర రంగాల మీద పెద్దగా ద్రుష్టి పెట్టలేదు కూడా. సినిమా రంగం కూడా వైసీపీ సర్కార్ విషయంలో పెద్దగా రియాక్ట్ కాని పరిస్థితి కూడా అంతా చూస్తున్నారు.


ఈ నేపధ్యంలో వాల్మీకి సినిమా టైటిల్ మార్పు వెనక వైసీపీ ఎంపీ ఒకరు ఉన్నారన్న వార్తలు ఇపుడు సంచనలం రేకెత్తిస్తున్నాయి. వాల్మీకి బోయ కులానికి చెందిన వారు, అదే సామాజికవర్గానికి చెందిన అనంతపురం ఎంపీ తలారి రంగయ్య వాల్మీకిని కించపరుస్తూ సినిమా తీయడాన్ని తప్పుపడుతూ టైటిల్ మార్చాలసిందేనని పై స్థాయిలో వత్తిడి తెచ్చాడని అంటున్నారు.


దీనివల్ల వాల్మీకి మూవీ టైటిల్ ఆఖరు నిముషంలో గద్దలకొండ గణేష్ గా మారిపోయింది. అయితే అప్పటికే పోస్టర్లు అన్నీ కూడా వాల్మీకిగానే  అన్ని సినిమా ధియేటర్లకూ  వెళ్ళిపోయాయి. ఇక ఈ సినిమా టైటిల్ మార్చాలని చాలా కాలంగా బోయ కులస్థులు ఆందోళ‌న చేస్తున్న సంగతి విధితమే. దీంతో తలారి రంగయ్య  చొరవ తీసుకుని కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్ ద్రుష్టికి కూడా సమస్యను తీసుకువచ్చారని అంటున్నారు.


మొత్తం మీద చూసుకుంటే వాల్మీకి మూవీ టైటిల్ మారడం వెనక వైసీపీ ఎంపీ హస్తం ఉందని ప్రచారం సాగడంతో మెగాభిమానులు కూడా హాట్ గానే రియాక్ట్ అవుతున్నారు. అసలే మెగా ఫ్యామిలీ నుంచి జనసేన నేతగా పవన్ ఉన్నారు. ఆయన ఇపుడు వైసీపీకి ఎదురు నిలిచి రాజకీయాలు చేస్తున్నారు. ఇపుడు ఈ టైటిల్ మార్పు తో మెగా కాంపౌండ్ నుంచి పూర్తి స్థాయి యాంటి రియాక్షన్ వైసీపీ సర్కార్ మీద వస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా సినిమా హిట్ కావడంతో మెగా ఫ్యాన్స్ హాపీ మూడ్లో ఉన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: