విజయ్ దేవరకొండ హీరోగా, రష్మిక హీరోయిన్ గా నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకుని పరాజయాన్ని మూటగట్టుకుంది. నాలుగు భాషల్లో ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోలేక బాక్సాఫీసు వద్ద  చతికిల పడింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ కి ఇది కోలుకోలేని దెబ్బ అనే చెప్పవచ్చు.


అయితే కథ పరంగా సినిమాకి విమర్శకుల మంచి మార్కులే పడ్డాయి. సినిమా రన్ టైం ఎక్కువ ఉండడం, కథనం నెమ్మదించడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిరస్కరించారు. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమాకి నష్టం వచ్చిందనే చెప్పాలి. అయితే తాజాగా వచ్చిన ఒక వార్త చిత్ర బృందాన్ని సంతోషంలో నింపింది. ఈ సినిమా ఫిలిమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ ఆస్కార్ ఎంట్రీ లిస్టులోకి అధికారికంగా ఎంపికైంది. ఈ చిత్రంతో పాటు మరో 28 ఇండియన్ సినిమాలు ఈ లిస్ట్‌లో ఎంపికయ్యాయి.


అయితే ఈ ఎంట్రీ లిస్ట్‌లో ఏకైక తెలుగు చిత్రంగా డియర్ కామ్రేడ్ ఉండడం విశేషం. సినిమాలో ఉన్న కంటెంత్ తో పాటు, సందేశం కూడా బాగుండడంతో ఈ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. అయితే ఈ సినిమాలన్నింటిని స్క్రీనింగ్ చేసి వాటిలో బెస్ట్ చిత్రాన్ని ఎంపిక చేసి దానిని బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ కేటగిరిలో ఆస్కార్‌కి పంపుతారు. ఏదేమైనా ఈ సినిమా ఆస్కార్ ఎంట్రీ లిస్ట్‌లోకి ఎంపిక కావడంతో ఈ చిత్ర యూనిట్ సంబరాలు జరుపుకుంటున్నారు.


ఆస్కార్ రావడం కంటే ఆ లిస్ట్ లోకి వెళ్ళడమే చాలా ఆనందంగా ఉందని విజయ్ దేవరకొండ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. యష్ రంగినేని నిర్మాతగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ మరియు బిగ్ బెన్ సంస్థలు కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: