తమిళ స్టార్ హీరో  సూర్య నటించిన  తాజా చిత్రం కాప్పాన్ (బందోబస్త్)  మొన్న విడుదలై  మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే తమిళనాడు , కేరళ లో ఈ చిత్రానికి టాక్ బాగుండడంతో బాక్సాఫీస్  వద్ద   దుమ్ము రేపుతుంది.  మొదటి రోజు ఈ చిత్రం  తమిళనాడు లో 7కోట్ల షేర్ ను వసూలు చేయగా  రెండో రోజు కూడా అదే జోరును కొనసాగించిందని సమాచారం.  ఇక కేరళ లో ఈ చిత్రం  మొదటి రోజు 1.45కోట్ల గ్రాస్ వసూళ్లతో  ఈఏడాది అక్కడ హైయెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టిన చిత్రంగా  రికార్డు సృష్టించింది.  


ఇదిలా ఉంటే   తెలుగు రాష్ట్రాల్లో  మాత్రం  ఈ చిత్రం  దారుణంగా నిరాశపరుస్తుంది. మొదటి రోజు బందోబస్త్  కేవలం 80లక్షల షేర్ ను మాత్రమే రాబట్టింది. సుమారు 400 స్క్రీన్ లలో  విడుదలైన ఈ చిత్రం అంత తక్కువ  షేర్ ను కలెక్ట్ చేయడంతో బయ్యర్లు  కలవరపడుతున్నారు. రెండో రోజు కూడా ఈ చిత్రం పుంజుకోలేదని సమాచారం. టాక్ నెగిటివ్ గా ఉండడం అలాగే ఈ చిత్రం తో పాటు విడుదలైన గద్దల కొండ గణేష్ సూపర్ హిట్ టాక్ తో అదిరిపోయే వసూళ్లను రాబడుతుండడంతో వాటి ప్రభావం ఫై బందోబస్త్ పడింది . కాగా తెలుగులో ఈ చిత్రం 6కోట్ల కు పైగా ప్రీ పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దాంతో  నష్టాలు తప్పేలా లేవు.  ఇక ఈ చిత్రంతో  సూర్య మార్కెట్ మరింతగా దిగజారింది. ఒకప్పుడు  తెలుగు స్టార్ హీరోల సినిమాలకు   దీటుగా  వసూళ్లను రాబట్టిన  సూర్య  సినిమాలు  గత కొంత కాలంగా చతికిలపడుతున్నాయి.  సూర్య  స్టోరీ సెలెక్షన్ లో తడబడుతూ  వరుస పరాజయాలతో ప్రస్తుతం తెలుగు మార్కెట్ ను కోల్పోయే పరిస్థితి తెచ్చుకోవడం  సూర్య అభిమానులకు అసహనం తెప్పిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: