సూపర్ స్టార్  రజినీ కాంత్ తరువాత  ఆ రేంజ్ లో తెలుగులో  మార్కెట్ ను సంపాదించుకున్నాడు  సూర్య. ముఖ్యంగా సింగం సిరీస్ తో  సూర్య క్రేజ్ అమాంతగా పెరిగిపోయింది. తెలుగు స్టార్ హీరోల సినిమాలకు దీటుగా అయన నటించిన చిత్రాలు  వసూళ్లను రాబట్టాయి.  అయితే ఇందంతా గతం.  కొన్ని సంవత్సరాల నుండి  సూర్య  నటించిన సినిమాలు  తెలుగులో దారుణ ఫలితాలను చవిచుశాయి. ఫలితంగా  సూర్య  మార్కెట్  సినిమా సినిమా కు తగ్గుతూ  వస్తుంది. ఇక తాజాగా సూర్య కి  బందోబస్త్ రూపంలో మరోసారి చేదు అనుభవం ఎదురైయింది. 


మొన్న విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ టాక్ ను తెచ్చుకోవడం అలాగే ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయకపోవడంతో మొదటి రోజు కేవలం 80లక్షల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇక  రెండో రోజుకూడా ఈ చిత్రం దారణమైన వసూళ్లను రాబట్టింది.  తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండో రోజు కేవలం  28.7లక్షల షేర్  ను మాత్రమే రాబట్టి షాక్ ఇచ్చింది.  ఈకలెక్షన్లను బట్టి చెప్పొచ్చు  తెలుగులో  సూర్య మార్కెట్ ఎలా ఉందోనని..మరి ఇప్పటికైన సూర్య జాగ్రత్తపడితే మంచింది. లేకపోతే ఇక మీదట ఆయన నటించిన సినిమాలను  తెలుగులో విడుదల చేయడానికి ఎవరు సాహసం చేయలేరు. ఇదిలా ఉంటే బందోబస్త్  తమిళ వెర్షన్ మాత్రం తమిళనాడు ,కేరళ లో మంచి వసూళ్లను రాబడుతుంది.  


తెలుగు రాష్ట్రాల్లో బందోబస్త్ రెండో రోజు వసూళ్ల  వివరాలు : 
నైజాం  -8 లక్షలు 
సీడెడ్ - 3.5 లక్షలు 
నెల్లూరు - 2 లక్షలు 
గుంటూరు -2.6 లక్షలు 
కృష్ణా - 3.6 లక్షలు 
తూర్పు గోదావరి - 3లక్షలు 
పశ్చిమ గోదావరి - 2లక్షలు 
ఉత్తరాంద్ర -4 లక్షలు 
మొత్తం  ఏపీ &తెలంగాణ లో రెండో రోజు  షేర్ - 28.7 లక్షలు  



మరింత సమాచారం తెలుసుకోండి: