వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ గద్దలకొండ గణేష్. రెండు రోజుల క్రితం విపరీతమైన అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా, నూరు శాతం ప్రేక్షకుల అంచనాలు అందుకుని ప్రస్తుతం మంచి టాక్ తో మరియు కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. వరుణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్, గద్దలకొండ గణేష్ అనే మాస్ క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నాడు. ఆ మాస్ క్యారెక్టర్ లో తన స్టన్నింగ్ పెర్ఫార్మన్స్ తో పాటు ఊర మాస్ డైలాగ్స్, 

అదరగొట్టే యాక్షన్ సీన్స్ తో ఇరగదీసిన వరుణ్ పై సర్వత్రా ప్రశంశల జల్లు కురుస్తోంది. ఇకపోతే నేడు మన గద్దలకొండ గణేష్, ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ షోకు ప్రత్యేక గెస్ట్ గా రాబోతున్నాడు. ఆయన ఎంట్రీ ఇచ్చిన వీడియో ప్రోమోని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు స్టార్ మా ఛానల్ వారు. ఇక ఆ ప్రోమోలో మన గణేష్ ని హోస్ట్  అయిన నాగార్జున గారు ఆహ్వానించడం, ఆ తరువాత ఆయనను చూసిన బిగ్ బాస్ హౌస్ మేట్స్, ఎంతో ఆనందంతో సందడి చేయడం మనం ఆ వీడియోలో చూడవచ్చు. ఇప్పటికే మంచి క్రేజ్, కలెక్షన్స్  తో ముందుకు సాగుతున్న ఈ సినిమాకు, 

నేడు బిగ్ బాస్ లోకి హీరో వరుణ్ ఎంట్రీ ఇవ్వడంతో మరికొంత పబ్లిసిటీ లభించినట్లయిందనే చెప్పాలి. అలానే బిగ్ బాస్ షోకు కూడా ఇది ఒకరకంగా మంచి ప్రమోషన్ గా కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు. మరి నిన్న షోలో రాహుల్ ఎలిమినేట్ కాగా, నేడు కూడా మరొకరి ఎలిమినేషన్ ఉండడంతో, ప్రస్తుతం ఆ జోన్ లో ఉన్న హిమజ మరియు మహేష్ లలో ఎవరు బయటకు వెళ్తారు అనేదానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ విషయమై ఏమి జరుగుతుందో తెలియాలంటే మాత్రం ఇవాళ రాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: