తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ షో. ఇటువంటి నేపథ్యంలో ఆదివారం జరగబోయే ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్ లోకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇటీవల డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన గద్దల కొండ గణేష్ చిత్రం విజయవంతంగా సినిమా హాల్లో ప్రదర్శన అవుతున్న తరుణంలో సినిమా ప్రమోట్ చేసుకునేందుకు వరుణ్ తేజ్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ని ఇటీవల బిగ్ బాస్ షో నిర్వాహకులు రిలీజ్ చేయడం జరిగింది. వరుణ్ తేజ్, బిగ్ బాస్ హౌస్ మేట్స్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.


శ్రీముఖి, హిమజ, పునర్నవి వరుసగా వరుణ్ తేజ్ కు లవ్ ప్రపోజ్ చేశారు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ పునర్నవిపై వరుణ్ తేజ్ వేసిన సెటైర్ నవ్వులు పూయిస్తోంది. వరుణ్ తేజ్ కు ప్రపోజ్ చేసే క్రమంలో..'నాకు ప్రపోజ్ చేయడం కొత్త' అంటూ పునర్నవి తడబడింది. నాకు లవ్ ప్రపోజ్ చేయడానికి ఈ అమ్మాయి తడబడుతోంది అంటే ఆల్రెడీ ఎవరికో ప్రపోజ్ చేసింది సర్ అని వరుణ్ నాగార్జునతో అన్నాడు. నాగార్జున నవ్వుతూ వరుణ్ షోని బాగా ఫాలో అవుతున్నట్లున్నాడు అని అన్నారు.


ఇప్పటికే చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి తమ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకోవడానికి రామ్ నాచురల్ స్టార్ నాని లాంటివారు హాజరవటం మనందరం చూసే తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వటంతో ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ చాలా హైలెట్ అని టాక్ వినపడుతోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో గద్దల కొండ గణేష్ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డు స్థాయిలో బాక్స్ ఆఫీస్ దగ్గర అదరగొడుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: