తెలుగు తోపాటు  ఇతర సినీ ఇండస్ట్రీ ల్లో  ఎక్కవ గా సినిమాలు శుక్రవారం విడుదలవుతుంటాయి. శనివారం , ఆదివారాలు  వారాంతం కాబట్టి  కలెక్షన్లు ఎక్కువగా వస్తాయి  వస్తాయనే ఉద్దేశంతో చాలా మంది మూవీ మేకర్స్  ఈ ఫార్మాలనే ఫాలో అవుతారు.  ఇదే రెగ్యులర్ జరిగే తంతు.. ఆతరువాత ఏవైనా స్పెషల్ హాలీడేస్ ఉంటే  బుధవారం , గురువారం , శనివారం  కూడా  విడుదలైన సినిమాలను చాలానే చూశాం .. కానీ  ఆదివారం విడుదలైన చిత్రాలు మాత్రం చాలా అరుదు.  పెద్ద సినిమాలతో పోటీ పడలేక  ఏవో కొన్ని చిన్న సినిమాలు ఆదివారం విడుదలైవుతాయి.  అయితే ఇప్పుడో  స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కూడా ఆదివారం విడుదలకానుందట.  


త్రివిక్రమ్ డైరెక్షన్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ .అల .. వైకుంఠపురములో..నటిస్తున్నాడు. ఈచిత్రాన్ని సంక్రాంతి రేస్ లో నిలిపిన విషయం తెలిసిందే.  అయితే జనవరి 10న  రజినీకాంత్ నటిస్తున్న దర్బార్ ,  జనవరి 11 శనివారం రోజు  మహేష్ బాబు  నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు విడుదలకానున్నడం తో పండగ సెలవులను క్యాష్ చేసుకునేందుకు  అల వైకుంఠపురములో జనవరి 12న ఆదివారం థియేటర్లలోకి  రావాల్సి వస్తుందట. అయితే ఈ రిలీజ్ డేట్ ఫై  అధికారక ప్రకటన వెలుబడాల్సి వుంది. 


ఇక సంక్రాంతి పండుగ కు రజినీకాంత్ , మహేష్ , అల్లు అర్జున్ తోపాటు  కళ్యాణ్ రామ్ కూడా బరిలోకి దిగుతున్నాడు.  ప్రస్తుతం కళ్యాణ్ రామ్ , సతీష్ వేగేశ్న  డైరెక్షన్ లో ఎంత మంచివాడవురా అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈసినిమాను జనవరి 15న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. మరి ఈ నలుగురి లో ఎవరు సంక్రాంతి  విన్నర్ గా నిలుస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: