ప్రముఖ నటులు, దర్శకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ ఎన్ శివ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన నటించిన చివరి చిత్రం  'సాప్ట్ వేర్ సుధీర్'. ఈ సందర్భంగా   చిత్ర నిర్మాత కె. శేఖర్‌ రాజు మాట్లాడుతూ -  'డాక్టర్ ఎన్ శివ ప్రసాద్ గారు మా చిత్రంలో మంత్రిగా ఒక  ప్రత్యేక పాత్రలో నటించారు. ఆయన మరణం మాకు, సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అన్నారు.


సుడిగాలి సుధీర్‌,ధన్యా బాలకృష్ణ  హీరోహీరోయిన్లుగా శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానేర్‌ పై   కె. శేఖర్‌ రాజు నిర్మిస్తున్న చిత్రం 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌'.  రాజశేఖర్‌ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర నిర్మాణం చివరి దశలో ఉంది.
 రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత తెలుగు సినీ రంగంలో మాములు నటుడిగా ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. ఎన్నో సినిమాల్లో చిన్నా చితక వేషాలతో అలరించాడు. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ‘మాస్టారి కాపురం’ సినిమా శివప్రసాద్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. అటు కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘డేంజర్’ సినిమాలో విలన్‌గా మెప్పించారు. అంతేకాదు ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ విలన్‌గా నంది అవార్డు అందుకున్నారు. ఇక నితిన్ హీరోగా వచ్చిన ఆటాడిస్తా సినిమాలో నన్ను కొట్లే అనే డైలాగ్‌తో బాగా ఫేమస్ అయ్యాడు శివప్రసాద్. నటుడిగానే కాకుండా దర్శకుడిగా తెలుగులో ‘ఇల్లాలు’, రోజా హీరోయిన్‌గా పరిచయమైన ‘ప్రేమ తపస్సు’, ఆ తర్వాత ‘టోపీరాజా స్వీటి రోజా’ ‘కొక్కోరకో’ వంటి పలు సినిమాలను కూడా డైరెక్ట్ చేసాడు. ఆయనకు ఒక భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: