పూజా హెగ్డే ది మామూలు  అందమా. అజంతా శిల్పం ఆ అమ్మడు అందంతోనే పందెం కాస్తోంది. స్టార్ హీరోయిన్ గా ఆమె ఒక్కసారిగా పది మెట్లు ఎక్కడానికి ఆ అందమే అసలైన కారణం. ఇక పూజాలో స్పెషాలిటీ ఏంటి అంటే ఆమె మోడ్రన్ డ్రెస్సుల్లోనూ ఇరగదీస్తుంది. ఫుల్ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో కూడా అదరగొడుతుంది. ఆమె అందాన్ని ఎరగా పెట్టి తీసిన సినిమా వాల్మీకి ఉరఫ్ గద్దలకొండ గణేష్ మూవీలో పూజా హెగ్డే ఓ రేంజిలో అందం ఆరేసిందట.


ఈ మూవీలో ఓల్డ్ సాంగ్ ఒకటి ఉంది. అదేంటి అంటే దేవత మూవీలో శోభన్ బాబు  శ్రీదేవి చేసిన ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్. అప్పట్లో అది మాస్ నంబర్ గా కిక్కెచ్చేసింది. ఇపుడు అదే సాంగ్ ని మళ్లీ తీసి హరీష్ శంకర్ ఈనాటి తరానికి కిక్కు ఇచ్చేశాడు. మరి నాటి శ్రీదేవి చేసిన నాటీ యాక్షన్, ఆ ఒంపులు, సొంపులు ఎవరు బాగా చూపగలరు అనుకుంటే పూజా హెగ్డే నేనున్నాను అంటూ అందమైన ఆన్సర్ ఇచ్చింది.


ఈ మూవీలో పూజా అందాలకు, ఆమె వయ్యారాలకు ఆడియన్స్ ఓ రేంజిలో ఫిదా అవుతున్నారట. ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఎల్లువచ్చే  గోదారమ్మ సాంగ్ కి సినిమా హాల్లో జనం సీట్లో కూర్చోవడంలేదుట. ఒక్కసారిగా లేచి నిలబడి గోల గోల చేస్తున్నారుట. ఇదే రెస్పాన్స్ కోసమే మేము ఒళ్ళు హూనం చేసుకున్నది అంటూ పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా తన ఆనందం పంచుకుంటోందంటే ఆ రెస్పాన్స్ ని మాటల్లో వర్ణించలేముగా. మొత్తానికి పూజా  నాటి శ్రీదేవిని మరిపించిందనే చెప్పాలన్నమాట. మరికనేం..ఒక్క సాంగ్ చాలుగా వాల్మీకిని ఒడ్డునపడేయడానికి అంటున్నారంట అంతా.





మరింత సమాచారం తెలుసుకోండి: