తెలుగు కామెడీ షో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను గురించి మరియు ఆయన పెర్ఫార్మెన్స్ గురించి ఆసక్తికరమైన సంచలనాత్మకమైన కామెంట్ చేశారు మెగాబ్రదర్ నాగబాబు. ఇటీవల జబర్దస్త్ టీం అయినా సుడిగాలి సుదీర్, రాంప్రసాద్, గెటప్ శీను కలిసి ముగ్గురు నటించిన ‘త్రీ మంకీస్’ చిత్రా లోగోని ఇటీవల నాగబాబు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ గెటప్ శీను లో అద్భుతమైన నటుడు ఉన్నాడు అంటూ పేర్కొన్నారు. వీల ముగ్గురిని చాలా దగ్గర నుండి నేను చూశాను కాబట్టి ఈ విషయం చెబుతున్నానని...ముగ్గురు చేసే నటన చాలా దగ్గర చూశాను కాబట్టే ఇలా మాట్లాడుతున్నానని...గెటప్ శ్రీను అద్భుతమైన ప్రతిభ ఉన్న కమెడియన్. అతడు అంతర్జాతీయ స్థాయిలో కూడా పెర్ఫామ్ చేయగలడు.


గెట్ శ్రీను నాకు కొడుకు కాదు.. కానీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే అతడిలో ఆ ప్రతిభ గమనించా అంటూ నాగబాబు పేర్కొన్నాడు. కానీ ఇండస్ట్రీ గెటప్ శీను ని సరిగ్గా గుర్తించడం లేదని ఉపయోగించుకోవడం లేదని సరిగ్గా సీన్ ఒకే ఒక అవకాశం మంచిది దొరికితే ఇండస్ట్రీలో తిరుగు ఉండదని నాగబాబు పేర్కొన్నాడు. అంతేకాకుండా జబర్డస్త్ లో వివిధ గెటప్ లలో ఎలా, వివిధ బాడీ లాంగ్వేజ్ లలో ఎలా నటించాడో నాకు తెలుసు. గెటప్ శ్రీనుని ఉపయోగించుకోక పోతే అది ఇండస్ట్రీకే నష్టం అని ఒక మంచి నటుడిని కోల్పోవడం జరుగుతుందని నాగబాబు అభిప్రాయపడ్డారు.


దీంతో నాగబాబు చేసిన కామెంట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. అంతేకాకుండా రాంప్రసాద్ మరియు సుడిగాలి సుధీర్ గురించి ఆసక్తికరమైన విషయాలు బాబు తెలియజేశారు. రాంప్రసాద్ మంచి రచయిత అంటూ పంచ్ డైలాగులు రాయడం లో రాంప్రసాద్ కి మించిన వారు లేరని అద్భుతమైన ప్రతిభ ఉన్నట్లు నాగబాబు తెలిపారు. మరియు అదే విధంగా సుడిగాలి సుదీర్ అయితే హీరో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నాగబాబు జోస్యం చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: