'సైరా' చిత్రం తర్వాత  మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న క్రేజీ ప్రాజెక్ట్  మరికొద్ది రోజుల్లో సెట్స్ పైకి పోనుంది. అక్టోబర్ మూడో వారంలో షూటింగ్ ఊపందుకున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఇప్పటినుంచే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడడం మొదలుపెట్టారు. ఇప్పటివరకు హిట్ తప్ప ఇంకొకటి తెలియని డైరెక్టర్లలో రాజమౌళి సరసన చేరిపోయిన కొరటాల మినిమమ్ గ్యారెంటీ సినిమా ఇస్తాడని చాలా మంచి పేరుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో తనకంటూ ఒక శైలిని ఏర్పరచుకున్న కొరటాల సాధారణంగా సామాజిక అంశాలపై చిత్రాలు తీస్తూ అందరినీ మెప్పిస్తుంటాడు.

ఇకపోతే కొరటాల చిత్రాల్లో ఉండే కథలకి బాణీలు చాలా ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాదాపు కొరటాల శివ తీసిన చిత్రాలన్నింటికీ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటి వరకూ అతను తప్ప ఇంకొకరితో పని చేయని కొరటాల మొట్టమొదటి సారి చిరంజీవి సినిమాకి పెద్ద రిస్క్ తీసుకోబోతున్నాడు. ఇప్పటివరకు ఘనవిజయం సాధించిన కాంబో ని కాదని కొరటాల బాలీవుడ్ లొని అజయ్-అతుల్ డ్యూయో ని చిరు చిత్రం కోసం సంగీతం అందించేందుకు సిద్ధం చేసుకుంటున్నాడట. 

ఇప్పటికే సైరా సినిమా కి అమిత్ త్రివేది ఇలాంటి మంచి బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ ని పెట్టుకున్న చిరంజీవి మరోసారి మరోసారి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇచ్చే బాణీలకు స్టెప్పులు వేయనున్నాడు. అజయ్-అతుల్ ఇద్దరు కలిసి ఇప్పటివరకు అగ్నీపథ్, మరియు ఈ మధ్య రిలీజ్ అయిన ధడక, సూపర్-30 వంటి సినిమాలకి ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చారు. మరాఠి చిత్రాలన్నిటిలో 'సైరత్' లాంటి భారీ మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన వీరి పేరు మారుమోగిపోతూ ఉంటుంది. మొట్టమొదటిసారి తెలుగులో ఆరంగ్రేటం చేయనున్న వీరు మెగాస్టార్ కోసం ఎలా వాయిస్తారో వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: