స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో. ఇప్పటివరకు బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి మరియు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి సక్సెస్ సాధించడంతో, వారిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. 

ఇకపోతే వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పక్కాగా ఫిక్స్ చేసినట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. ఆ వార్తల ప్రకారం, ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు ఫిక్స్ చేశారట. ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ సరిలేరు నీకెవ్వరు, సూపర్ స్టార్ రజినీకాంత్ దర్బార్, నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు కూడా ఉండడంతో, తమ సినిమా రిలీజ్ తేదీని ముందే ఫిక్స్ చేసి ఆ డేట్ ని తెలివిగా లాక్ చేసిందట అల వైకుంఠపురములో యూనిట్. 

ఇలా ముందే తేదీని కనుక ఫిక్స్ చేస్తే, రాబోయే మిగతా సినిమాల రిలీజ్ డేట్ ల విషయమై కన్ఫ్యూజన్ ఉండకూడదనే ఈ విధంగా రిలీజ్ డేట్ ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి జనవరి 12 ఈ సినిమా రిలీజ్ అవుతుంటే, దానికి రెండు రోజల ముందు, అనగా జనవరి 10న సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని, తరువాత రజిని దర్బార్ మూవీ 13న, అలానే  కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా 15న రిలీజ్ అవుతాయని అంటున్నారు. అయితే మిగతా సినిమాల రిలీజ్ డేట్ ల విషయమై మాత్రం, ఆయా సినిమాల దర్శక, నిర్మాతల నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: