రైటర్ గా సూపర్ సక్సెస్ అందుకున్న కొరటాల శివ డైరక్టర్ గా కూడా సంచలన విజయాలను అందుకున్నాడు. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస హిట్లు కొడుతున్న కొరటాల శివ తన తర్వాత సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేస్తాడని తెలుస్తుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తైన ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.


కొరటాల శివ సినిమా అంటే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఉండాల్సిందే. కాని చిరు సినిమాకు కొరటాల శివ తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్టు తెలుస్తుంది. చ్రిఉతో కొరటాల శివ మూవీలో బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ ను తీసుకుంటున్నారట. ఇంతకీ కొరటాల శివను అంతగా మెప్పించిన ఆ మ్యూజిక్ డైరక్టర్స్ ఎవరు అంటే అజయ్ అతుల్ అని తెలుస్తుంది.   


బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యుజిషియన్స్ గా పేరు తెచ్చుకున్న అజయ్ అతుల్ సైరత్, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, సూపర్ 30 సినిమాలకు మ్యూజిక్ అందించారు. వారి మ్యూజిక్ కు ఫిదా అయిన కొరటాల శివ తన నెక్స్ట్ సినిమాకు వారిని సెలెక్ట్ చేశారట. దాదాపు అజయ్ అతుల్ చిరు సినిమాకు మ్యూజిక్ ఇవ్వడం కన్ఫాం అంటున్నారు.   


మొదటిసారి దేవిని కాకుండా బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ తో చేస్తున్నాడు కొరటాల శివ. మరి ఈ ఆల్బం ఎలా ఉండబోతుందో చూడాలి. ప్రస్తుతం సైరా ప్రమోషన్స్ లో ఉన్న చిరు రిలీజ్ తర్వాత కొరటాల శివ సినిమాపై దృష్టి పెడతారని తెలుస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. అనుష్క, శ్రద్ధ శ్రీనాథ్ ల పేర్లు పరిణీళణలో ఉన్నాయి. ఈ సినిమాను కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తారని తెలుస్తుంది.          


    



మరింత సమాచారం తెలుసుకోండి: