కేవలం కొద్ది రోజుల వ్యవధిలో మన టాలీవుడ్ నుంచి మరొక భారీ బడ్జెట్ చిత్రం అంబరాన్నంటే అంచనాలతో బాక్సాఫీస్ వద్ద బరిలో దిగనుంది. గత నెల విడుదలైన సాహో అనుకున్నంత రాణించలేక చతికలపడిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఊహించిన దానికన్నా ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టిన ఈ చిత్రం సౌత్ లో మాత్రం థియేటర్ల దగ్గర తేలిపోయింది అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా దెబ్బతో సైరాకు కొద్దిగా జ్వరం పట్టుకుంది. అందుకే వాళ్ళు చేసిన తప్పులని వీళ్ళు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతూ అడుగుమార్చి అడుగు ఆచితూచి వేస్తున్నారు.

అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సాహో తన విడుదలకు ముందు చేసిన అతి పెద్ద తప్పు సైరా టీమ్ కూడా చేసేసింది. ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్లు బాలీవుడ్ కి చెందిన వారు. 'సైరా' కు అయితే అమిత్ త్రివేది తో పాటు ఒక హాలీవుడ్ మ్యుజిక్ టెక్నీషియన్ కూడా ఉన్నాడు. సాహో విడుదలకు కొద్ది రోజుల ముందు విడుదల చేసిన పాటలు ప్రజలను అంతలా మెప్పించలేకపోయాయి అనే చెప్పాలి. ఏదో ఒక హాలీవుడ్ సినిమా లేదా కంటెంట్ ఉన్న సినిమాలో అయితే పాటలకు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవచ్చు కానీ మన తెలుగులో వస్తున్న కమర్షియల్ చిత్రాలకు హిట్ పాటలు ఉంటే సగం సినిమా కొట్టేసినట్టే. ఈ లాజిక్ తెలియక సాహో క్లాస్ గా ఉండే పాటలను కొద్దిరోజుల ముందు రిలీజ్ చేయగా దానిని జనాలు తీసుకోలేకపోయారు. 

ఇకపోతే సైరా టీమ్ కూడా ఇప్పటివరకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మినహాయిస్తే ఏ ఒక్క పాటనూ విడుదల చేయలేదు. దేశవ్యాప్తంగా సినిమా విడుదల అవుతుంది కాబట్టి అన్ని భాషలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన మ్యూజిక్ కొంచెం అటు ఇటు గా ఉంటుంది అనే చెప్పాలి. రిలీజ్ ఫంక్షన్ కి ముందుగా పాటలు కనుక విడుదల చేసినట్లయితే ప్రజల్లోకి వెళ్లేందుకు కొంచమైనా టైమ్ తీసుకుని ఉండేవి. ఇక ఈ హడావిడిలో పడి పోయి ఈ రోజున కూడా పాటలు వదలకపోతే కేవలం యాక్షన్ సీన్లు మరియు చిరంజీవి మేనియా తో చిత్రం లాగడం చాలా కష్టం. ఒక్కటి... సైరా వీలైనంత త్వరగా పాటలు వదలాలి లేదా సినిమా మరింత అత్యద్భుతంగా ఉండాలి. లేకపోతే చివరికి సాహో కి పట్టిన గతే పడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: