టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన ‘హార్ట్ ఎటాక్’ మూవీలో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆదాశర్మ.  బాలీవుడ్ లో ఓ హర్రర్ మూవీలో నటించిన అదాశర్మ తెలుగు లో నటించిన మొదటి సినిమా అయినా మంచి పర్ఫామెన్స్ చూపించింది.  ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించిన  టాప్ హీరోయిన్ లీస్ట్ లో మాత్రం చేరలేక పోయింది.  తెలుగులో పలు మూవీస్ లో నటించినప్పటికీ.. క్లిక్ కాలేక పోయింది. మంచి అవకాశాలు వచ్చినప్పటికీ సరైన హిట్లు లేక నిలదొక్కుకోలేక పోయింది. దీంతో సెకండ్ హీరోయిన్‌గా సైడ్ అయిపోయింది.

కానీ, ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన హావభావాలతో పాటు.. చిత్ర విచిత్ర ఫీట్లు చేస్తూ నెటిజన్ల గుండెల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. స్వతహాగా యోగా, జిమ్నాస్టిక్ లో మంచి ప్రావిణ్యం ఉన్న ఆదాశర్మ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాజాగా  తనకు పెళ్లి కొడుకు కావాలంటూ బహిరంగంగా వెల్లడించారు. అతడి రంగు, కులం, సోషల్ మీడియా ఫాలోయింగ్ ఇవేవీ తాను పట్టించుకోనని ట్వీట్ చేసింది. అయితే ఉల్లిపాయలు తిననివాడు అయ్యుండాలని, ముఖంపై చిరునవ్వు చెదరకుండా మూడు పూటలా వంట అతడే చేయాలని కొన్ని కండిషన్లు పెట్టింది. రెగ్యులర్ గా షేవ్ చేసుకోవాలని, సంప్రదాయ దుస్తులే ధరించాలని షరతులు విధించింది.  ఉల్లిపాయలు తిననివాడు అయ్యుండాలని షరతులు విధించింది.

ఆదా శర్మ అంతటితో ఆగలేదు. మందు, మాంసం ఇంట్లోనూ, బయట నిషేధం అని స్పష్టం చేసింది. దాంతోపాటే, భారత్ లోని అన్ని భాషల చిత్రాలపైనా సదభిప్రాయం కలిగి ఉండాలని, వాటిని ఆస్వాదించే మనసున్నవాడే తనను మనువాడొచ్చని ట్విట్టర్ లో వెల్లడించింది. మొత్తానికి ఆదాశర్మ ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్లు చేసిందో కానీ, నెటిజన్లు మాత్రం భారీగా స్పందిస్తున్నారు. అతడికి తాగేందుకు ఐదు లీటర్ల నీటిని ప్రతి రోజూ అందిస్తానని తెలిపింది.  ఆదా శర్మ అంతటితో ఆగలేదు. మందు, మాంసం ఇంట్లోనూ, బయట నిషేధం అని స్పష్టం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: