నందమూరి కళ్యాణ్ రామ్ 118 తో మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకున్నాడు. సీరియస్ గా సాగే కథ కథనాలతో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన 118 నిజంగా ఒక డిఫ్రెంట్ సినిమాగా అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మళ్ళీ ఎలాంటి ఎక్స్‌పరిమెంటల్ సినిమా తో వస్తాడో అనుకునేలోపే మాంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకొని అందరిని అట్రాక్ట్ చేశాడు. కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న సతీశ్ వేగేశ్న తో ప్రస్తుతం వస్తున్న సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంతేకాదు ఈ సినిమాకి ఒక ఆసక్తికరమైన టైటిల్ ని ఫిక్స్ చేశారు. అదే 'ఎంత మంచి వాడవురా'. టైటిల్ కి తగ్గట్టే కళ్యాణ్ రామ్ పాత్ర ఉంటుందని తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ చూస్తుంటే అర్థమవుతోంది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ మేకోవర్ లో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. 

ఇక ఈ సినిమాలో మెహరీన్.. కళ్యాణ్ రామ్ కి జంటగా నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ ఇండియా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఉమేష్ గుప్త- సుభాష్ గుప్త నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఫస్ట్ లుక్ తో ఈ సినిమా ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. ఆదిత్య మ్యూజిక్ కంపెనీ బ్యానర్ కి మొదటి సినిమా కావడంతో బారీగా నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ మహేష్- బన్ని లకు పోటీగా బరిలో దింపుతున్నారు.

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ సతీష్ వేగేశ్న శతమానం భవతి, శ్రీనివాసకళ్యాణం లాంటి సినిమాలతో తన   అభిరుచి ఏంటో అందరికి అర్థమైంది. అలాంటిది ఇప్పుడు మాస్ సినిమా ట్రై చేస్తున్నాడు. అవును.. కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఎంత మంచివాడవురా సినిమాలో మాస్ ఎలిమెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయని లేటెస్ట్ న్యూస్. కథ క్లాస్ అయినప్పటికి కాస్త మాస్ టచ్ ఇచ్చి కళ్యాణ్ రామ్ ని మాంచి మాస్ హీరోగా ప్రజెంట్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఇక కళ్యాణ్ రామ్ కి కూడా మాస్ క్యారెక్టర్స్ కొత్తేమి కాదు. మరి ఈ సినిమాలో ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: