వెండితెర అయినా, బుల్లితెర అయినా.. సినీ టీవీ పరిశ్రమల్లో వ్యక్తిగతంగా స్వార్థం చూసుకునే వాళ్లే ఎక్కువగా ఉన్నారన్న విషయం అందరికి తెలిసిందే. ఏ చిన్న పనికైనా 'నాకేంటి' అనేవాళ్ళే ఇండస్ట్రీ మొత్తం ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే స్నేహానికి విలువ ఇస్తుంటారు. జబర్దస్త్ యాంకర్ రష్మీ కూడా అలాంటి మనిషి అని నిరూపించుకుంది. తన కెరీర్ లో చాలా ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చానని రష్మీ చాలా సందర్భాల్లో కన్నీరు పెట్టుకొని చెప్పిన సంగతి తెలిసిందే. అలాంటి స్టేజ్ నుంచి వచ్చింది కాబట్టే.. జబర్దస్త్ లోనే కాదు.. ఎవరు ఏ సాయం అడిగినా కాదనకుండా చేస్తుంటుంది రేష్మి.

నెల్లూరుకు చెందిన జబర్దస్త్ నటుడు కిరాక్ ఆర్పీ చిన్న ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ పెట్టాడు. అందుకు సంబంధించి ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమానికి రష్మిని ఆహ్వానించాడు. తనతో ఉన్న స్నేహం కారణంగా రష్మిని రెమ్యునరేషన్ తక్కువ తీసుకోవాలని కోరాడు. అయితే ఇచ్చినమాట ప్రకారం వస్తానని చెప్పిన రష్మి, ఓపెనింగ్ కోసం డబ్బు తీసుకోకుండా ఓపెనింగ్ చేసి పెడుతోంది.

వాస్తవంగా చూస్తే రష్మి గౌతమ్ కాల్షీట్ కావాలంటే లక్షల్లో ఉన్న విషయం తెలిసిందే. జబర్దస్త్ కు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ప్రకారం చూస్తే రష్మికి నెలకు నాలుగు ఎపిసోడ్లకు కలసి 2 లక్షలకు పైగానే వస్తోంది. బైట ఫంక్షన్లకు కాల్షీట్ ఇస్తే ప్రోగ్రామ్ కు 2 నుంచి 4 లక్షల వరకు డిమాండ్ చేస్తుంది. ఆ లెక్కన ఆర్పీ కోసం రష్మి దాదాపు 2 లక్షల రూపాయల్ని త్యాగం చేసింది. 

ఇదే విషయాన్ని ఎంతో గొప్పగా ఆర్పీ తన వాళ్లందరి దగ్గర ఆనందంగా చెప్పుకుంటున్నాడు. తనుచూసిన అతికొద్దిమంది వ్యక్తుల్లో రష్మి కూడా ఒకరని గొప్పగా చెబుతున్నాడు. నిజానికి ఆర్పీ విషయంలోనే కాదు.. జబర్దస్త్ కు చెందిన ఎంతోమంది నటుల విషయంలో రష్మి ఇలా ఉదారంగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. అలా తనకు అందమేకాదు, మంచి మనసు కూడా ఉందని నిరూపించుకుంటోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: