బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ప్రస్తుతం  'లాల్ సింగ్ చద్దా' లో నటించానికి రెడీ అవుతున్నాడు. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ  'ఫారెస్ట్ గంప్' రీమేక్ గా తెరకెక్కునున్న ఈ చిత్రం నవంబర్ 1న సెట్స్ మీదకు వెళ్లనుంది.  ఈ చిత్రంకోసం అమీర్ ఏకంగా  20కిలోల  బరువు తగ్గాడట.  ఇక ఈ సినిమా  దేశ వ్యాప్తంగా 100 లొకేషన్లలో షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. అందులో భాగంగా  గుజరాత్ , హైదరాబాద్ , ముంబై , కేరళ తదితర  ప్రాంతాల్లో  లొకేషన్ల వేటలో  వున్నారు  చిత్ర యూనిట్.  



ఈచిత్రంలో  అమీర్ సర్దార్ పాత్రలో కనిపించనుండగా  హీరోయిన్ గా నటించనుంది.  వీరితో పాటు తమిళ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ,అమీర్ కు  ఫ్రెండ్ గా నటించనున్నాడు. విజయ్ సేతుపతికి  బాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా.  త్వరలోనే ఈచిత్రం  గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.  ఇక  గత ఏడాది  అమీర్  ఖాన్ కు థగ్స్ అఫ్ హిందుస్థాన్  భారీ షాక్ ఇచ్చింది.  భారీ అంచనాల మధ్య విడుదలైన  ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద  బోల్తా పడడంతో డిజాస్టర్ల జాబితాలో చేరిపోయింది . దాంతో  అమీర్  లాల్ సింగ్ చద్దా తో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని బావిస్తున్నాడు.




ఈచిత్రంతో పాటు అమీర్.. కోలీవుడ్  బ్లాక్ బాస్టర్ మల్టీ స్టారర్  మూవీ  విక్రమ్ వేద  రీమేక్ లో నటించడానికి ఇటీవల  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.  స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఈ రీమేక్ లో మరో హీరోగా  నటించనున్నాడు.  ఈ చిత్రంలో విజయ్ సేతుపతి పాత్రలో అమీర్ ఖాన్ నటించనుండగా మాధవన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: