హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన సైరా ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రాజమౌళి మరియు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ...నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన సందర్భంలో నాకు ధైర్యం చెప్పింది మా అన్నయ్య చిరంజీవి గారు అటువంటి అన్నయ్య అందరికీ ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఇంటర్ ఫలితాల విషయంలో మరణించిన విద్యార్థులు ఉండేవారే కాదు అడ్డు పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.


అప్పుడు నాకు ధైర్యం చెప్పి ఇద్దరు మనుషులు నా అన్నయ్య వదిన ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అని పేర్కొన్నారు. చిరంజీవి గారు నాకు అన్నయ్య కంటే చిరంజీవి గారు అంటేనే గౌరవం అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...చిరంజీవి కి ఎలాంటి చెడు చేయాలని చూసిన ఆయన మాత్రం మిత్రులకు మంచి కోరే వ్యక్తి అని పవన్ పేర్కొన్నారు. అంతేకాకుండా నాకంటే వయసులో చిన్నవాడైన రామ్ చరణ్ ఇంతటి పెద్ద సినిమా నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. చరణ్ నా కళ్ళముందే పుట్టి పెరిగాడు. చిరంజీవి గారు ఎలాంటి సినిమాల్లో నటించాలని అనుకున్నానో అలంటి చిత్రాన్ని చరణ్ నిర్మించాడు.


మన భారతదేశం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి వ్యక్తుల సమూహం. మనపైన అందరూ దాడి చేశారు కానీ భారతీయులు ఎప్పుడూ ఏ దేశం పైనా దాడి చేయలేదు. నరసింహారెడ్డి ఎలా బ్రిటిష్ వారితో పోరాడారో మనకు తెలియదు. ఆయన పోరాటాన్ని దృశ్యరూపంలో చూపించేదే ఈ చిత్రం అని పవన్ అన్నారు. అలాగే పరుచూరి బ్రదర్స్ పై కూడా పొగడ్తల వర్షం కురిపించారు పవన్. ఇక ఫైనల్ గా దిగ్గజ దర్శకుడు రాజమౌళి గురించి ప్రస్తావిస్తూ...తెలుగు సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి గారు ఇప్పుడు ఈ వేడుకలో ఉండటం చాలా సంతోషమని...రాజమౌళి గారి గెలిస్తే సంతోషం వ్యక్తులలో నేను కూడా ఒకడిని..మన తెలుగు వాళ్ళు ఎవరు గెలిచినా మనం సంతోషించాలి అని పవన్ కళ్యాణ్ ఈ ప్రీ రిలీజ్ వేడుకలో అదిరిపోయే ప్రసంగం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: