టాలీవుడ్ క్రేజీ డైరక్టర్స్ ఒకరిలో హరీష్ శంకర్ ఒకరు. ముఖ్యంగా మెగా హీరోలతో ఆయన సినిమా అంటే పక్కా హిట్ అన్న సెంటిమెంట్ కూడా ఉంది. రీసెంట్ గా వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ హిట్టు కూడా దీనికి ఉదాహరణ అని చెప్పొచ్చు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్ తండా రీమేక్ గా వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాతో హరీష్ శంకర్ మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.


వరుణ్ తేజ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో ఈ సినిమాకు అంతటా పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాలో వరుణ్ తేజ్ తన నట విశ్వరూపం చూపించాడని చెప్పొచ్చు. ఇక హీరోయిన్స్ గా నటించిన పూజా హెగ్దె, మృణాళిని కూడా అదరగొట్టేశారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హరీష్ శంకర్ మిగతా హీరోల గురించి కూడా ప్రస్థావించడం జరిగింది. 


రీసెంట్ గా వరుస సినిమాలు హిట్లు కొడుతున్న అర్జున్ రెడ్డి అదేనండి విజయ్ దేవరకొండ గురించి ఓ క్రేజీ కామెంట్ చేశాడు హరీష్ శంకర్. విజయ్ దేవరకొండను ఒకసారి కలుద్దామని మెసేజ్ పెడితే మరో వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు బిజీ భయ్యా సినిమా గురించి కాకుండా అయితే కలుద్దామని మెసేజ్ పెట్టాడట. దానికి రిప్లై గా సినిమా కాకుంటే నీతోని నాకేంటి పని అని రిప్లై ఇచ్చాడట. ఆ వన్ ఇయర్ తర్వాతే కలుస్తా అని మెసేజ్ పెట్టాడట.


మొత్తానికి విజయ్ దేవరకొండ మీద ఓ క్రేజీ కామెంట్ వదిలాడు హరీష్ శంకర్. విజయ్ చెప్పాడని కాదు కాని అతనితో సినిమాకు దర్శక నిర్మాతలు క్యూలో ఉన్నారు. డియర్ కామ్రేడ్ ఫెయిల్ అయినా ప్రస్తుతం విజయ్ చేస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత విజయ్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: