బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో అలి రెజాని ఎలిమినేట్ చేశాడు బిగ్ బాస్.  హౌజ్ లో ఉన్న స్ట్రాంగ్ కంటెస్టంట్ అయిన అలి రెజాని అంత త్వరగా హౌజ్ నుండి బయటకు పంపిస్తారని అనుకోలేదు. కంటెస్టంట్స్ అందరితో బాగానే ఉంటున్నా టాస్క్ వచ్చినప్పుడు అలి రెజా ఇంటి సభ్యుల మీద గొడవ పడటం ఆడియెన్స్ కు నచ్చలేదు. అందుకే అతను నామినేషన్స్ లో ఉండగా ఎలిమినేట్ చేశారు.


అయితే ఈ వీక్ రాహుల్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి పునర్నవితో తిట్లు తినడం.. వరుణ్ తో డిస్కషన్స్ పెట్టడం తప్ప రాహుల్ పెద్దగా పొడిచింది ఏమి లేదు. అయితే లాస్ట్ వీక్ ఎలిమినేట్ చేసి బయటకు పంపుతారు అనుకుంటే రాహుల్ ది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పాడు నాగార్జున.


నిజంగా రాహుల్ కు బయట అంత ఫాలోయింగ్ ఉందా అంటే ఉంది కాని ఎలిమినేట్ నుండి సేఫ్ అయ్యేంత కాదు. అలి రెజాని మించిన క్రేజ్ అయితే లేదు. ఏమైందో ఏమో కాని రాహుల్ కు వారం వారానికి బయట ఫ్యాన్ ఫాలోయిన్ ఎక్కువైంది. ఇంట్లో పునర్నవితో రాహుల్ ప్రేమాయణం సాగిస్తున్నాడు. అది మధ్యలో డిస్ట్రబ్ చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో రాహుల్ ను ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పి ఇంట్లోకి పంపించేస్తున్నాడు.


సోమవారం ఎపిసోడ్ లో రాహుల్ మళ్లీ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాహుల్ రీ ఎంట్రీ పునర్నవి, వరుణ్ లకు హ్యాపీ థింగ్ అవుతుంది. మరి రాహుల్ ఇక మీదట తన గేం ప్లాన్ ఏదైనా మార్చుతాడా లేక అదే ఆట కొనసాగిస్తాడా అన్నది సోమవారం ఎపిసోడ్ లో తెలుస్తుంది. ఇక మండే నామినేషన్ ప్రక్రియ ఉంటుంది.. ఈసారి ఎవరెవరు నామినేట్ అవుతారో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: