నిన్నరాత్రి జరిగిన ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. మధ్యలో వర్షపు చినుకులు పడుతూ ఉన్నా ఈ ఈవెంట్ కు వచ్చిన వేలాదిమంది చిరంజీవి అభిమానులు కదలకుండా ఈ ఈవెంట్ ను ఆ వర్షపు చినుకులలో తడుస్తూ ఎంజాయ్ చేయడం చిరంజీవి స్టామినాను సూచిస్తోంది. 

ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణ చిరంజీవి పవన్ కళ్యాణ్ ల కలయిక అయినప్పటికీ చిరంజీవి రాజమౌళిని ఆకాశంలోకి ఎత్తేస్తూ ఉద్వేగపూరితమైన పొగడ్తలతో ‘బాహుబలి’ రాకుంటే తాను ‘సైరా’ తీసే సాహసం చేయలేకపోయేవాడిని అంటూ కామెంట్స్ చేసాడు. తెలుగు సినిమా మార్కెట్ ను పెంచిన ఘనత రాజమౌళికి దక్కుతుందని అంటూ రాజమౌళి స్పూర్తితో తాను ‘సైరా’ తీసే సాహసం చేసాను అంటూ చిరంజీవి ప్రత్యక్షంగా ‘సైరా’ నిర్మాణానికి కారణం ‘బాహుబలి’ అంటూ వివరణ ఇచ్చాడు.

తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ‘శంకరాభరణం’ తో తెలుగు ప్రజల గౌరవం పెరిగిందని ఆ తరువాత ఎన్నో గొప్ప సినిమాలు వచ్చినా ‘బాహుబలి’ వచ్చిన తరువాత మాత్రమే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తెలుగు సినిమాను గుర్తించింది అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. తిరిగి అటువంటి గౌరవం తెలుగు ప్రజలకు తెలుగు సినిమాకు ‘సైరా’ వల్ల వస్తుంది అంటూ ఈ మూవీ ప్రతి తెలుగువాడు గర్వించేలా ఉంటుంది అన్న అభిప్రాయాన్ని వెల్లడించాడు.

తన మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదల సమయంలో ఎలాంటి టెన్షన్ పడ్డానో ఇప్పుడు ‘సైరా’ విషయంలో అటువంటి టెన్షన్ పడుతున్న విషయాలను వివరిస్తూ ఈ సినిమా విజయంతో మళ్ళీ భారతదేశంలోని అందరు తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటారు అంటూ తన కలను వివరించాడు. ఈ మూవీ తాను రికార్డుల కోసం లాభాల కోసం తీసిన సినిమా  కాదు అంటూ తెలుగువారికి గౌరవం కలిగించడానికి తాను ఈ మూవీని తీసాను అంటూ అత్యంత భావోద్వేగంగా చిరంజీవి మాట్లాడిన మాటలను అభిమానులు చాల ప్రశాంతంగా విన్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: