152 వ చిరు సినిమాగా తెరకెక్కిన సినిమా సైరా.. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ బడ్జెట్ తో భారీ కటౌట్స్ తో పెద్ద పెద్ద అతిరథ మహారథులు నటించిన ఈ సినిమా అతి త్వరలోనే విడుదల కాబోతుంది. మెగా ఫ్యాన్స్ ఆరాటం ఇప్పటి నుండే మరింతగా పెరిగిందని వేరేలా చెప్పనక్కర్లేదు. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాకు మరింత హైప్ ను తీసుకొచ్చింది . ఆ ఈవెంట్ లో చిరు సినిమా గురించి కొన్ని తెలియని విషయాలను అందరికి చెప్పారు. 


అదేంటంటే.. ఈ సినిమాకు వేరే నిర్మాతను అనుకున్నాము.. కానీ, అంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాము. ఎవరికో ఆ నిర్మాత బాధ్యతలు ఇచ్చి రిస్క్ లో పడటం కన్నా నేనే చేయడం బెస్ట్ అనుకోని ఈ విషయం గురించి చరణ్ కి చెప్పగా, దానికి చరణ్ మాట కూడా మాట్లాడకుండా ఓకే చెప్పాడు. డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలనుకుంటే.. అప్పుడు కొందరు సినీ ప్రముఖులు నన్నే చేయమన్నారు.. అటు యాక్టింగ్, ఇటు డైరెక్షన్ బాధ్యతలు చేయలేనని సురేందర్ రెడ్డికి అప్పగించాము. 


చెర్రీ ధ్రువ సినిమాకు దర్శకత్వం వహించిన సురేందర్ డైరెక్షన్ నాకు కూడా నచ్చడంతో అతనే ఈ సినిమాను తీయాలని అనుకున్నాము. ఆ మాట చెప్పగానే సురేందర్ రెడ్డి ఎగిరి గంతేస్తాడు అనుకున్నాను. క్వైట్‌గా, కంపోజ్‌డ్‌గా ఉండి.. నాకు కొంచెం టైమ్ కావాలి సార్ అన్నాడు. అది మాత్రం నాకు షాక్ గా అనిపించింది అని చిరు చెప్పుకొచ్చారు. వారం తర్వాత అతను వచ్చి నేను చేస్తాను సార్ అని చెప్పాడు. అలా ఒక నెల రోజుల్లో అన్ని తెలుసుకొని వచ్చి కథ రెడీ చేసాడు. 


ఈ సినిమా మొదలైనప్పటి నుండి నాకు ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపేలా చేశారు. నన్ను నానా హింసలు పెట్టారు.. అంటూ చిరు వెల్లడించారు. మేకప్ వేసుకొని కత్తి సాము, గుర్రపు స్వారీ వంటి చారిత్రాత్మక విద్యలు అన్ని చేయించారు. అరె ఈ వయసులో నేను ఇది చేయగలనా అని ఎప్పుడు అనుకోలేదు..నా అభిమానుల  కోసం తప్ప మారేది నాకు గుర్తొచ్చేది కాదు. 25 సంవత్సరాల క్రితం ఏ జోష్‌తో అయితే చేశానో అదే జోష్ ఈ బాడీ, నా మనసు నాకు సపోర్ట్ చేశాయి . ఒకటి మాత్రం చెప్తాను టెక్నాలిజీ కొంచం ఇబ్బంది పెట్టిన కూడా, ఈ సినిమాలో నటించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటూ చిరు వెల్లడించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: