నిన్న జరిగిన ‘సైరా’ ఈవెంట్ లో పవన్ నోటివెంట అనుకోకుండా వచ్చిన ఒక మాటలో అనేక అర్ధాలు కనిపిస్తున్నాయి. దేశం గర్వింప దగ్గ వ్యక్తిగా చిరంజీవిని చూడాలని తాను కలలు కన్నా ఆ కల నెరవేరలేదు అంటూ చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలి అని తాను కలగన్న కోరిక నెరవేరలేక పోయింది అన్న భావన ద్వనించేలా పవన్ మాట్లాడాడు.

అంతేకాదు తాను వ్యక్తిగతంగా దేశం గర్వించే వ్యక్తిగా ఎదగాలని ప్రయత్నాలు చేసినా తాను కూడ ఫెయిల్ అయ్యాను అంటూ రాజకీయాలలో తాను ఫెయిల్ అయిన విషయాన్ని పరోక్షంగా తనకు తానే ప్రస్తావించుకున్నాడు పవన్. అయితే తామిద్దరం చేయలేని ఒక సాహసాన్ని ‘సైరా’ నిర్మించడం ద్వారా చరణ్ చేసి భారత దేశం గర్వించే వ్యక్తిగా ఎదగడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అంటూ పవన్ చేసిన కామెంట్స్ లో అనేక అర్ధాలు ఉన్నాయి.

ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ రికార్డుల గురించి కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసాడు. ఇండస్ట్రీలో సినిమాలు ఆ సినిమాలలో నటించిన హీరోలు క్రియేట్ చేసిన రికార్డులు ఏవీ శాస్వితం కావు అంటూ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు వచ్చినా చిరంజీవి స్థానాన్ని అందుకునే వ్యక్తి ఇప్పట్లో రావడం కష్టం అనీ తన అభిప్రాయం అంటూ మరో షాకింగ్ కామెంట్ చేసాడు. ‘సైరా’ మూవీ చివరిలో ‘జనగణమన’ అర్ధాన్ని వివరిస్తూ తాను చెప్పే రెండు నిముషాల వాయస్ ఓవర్ తన జీవితంలో ఒక మరిచిపోలేని సంఘటన అని అంటూ ప్రజలకు దేశభక్తిని కలిగించే విధంగా తన వాయస్ ఓవర్ ‘సైరా’ లో వినిపించ బోతోంది అన్న సంకేతాలు పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. దీనితో పవన్ కళ్యాణ్ సినిమాకు రీ ఎంట్రీకి స్పూర్తిని ఇచ్చే సినిమాగా ‘సైరా’ మారబోతోంది అనుకోవాలి..
 


మరింత సమాచారం తెలుసుకోండి: