బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేషన్ పూర్తయింది. నామినేషన్ లో ఉన్న మహేష్, హిమజలలో హిమజ వెళ్తుందని అందరూ అనుకున్నారు. అందరూ ఊహించినట్టుగానే హిమజ ఇంటి నుండి వెళ్ళిపోయింది. అయితే ఆమె ఎలిమినేట్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటన్నింటిని పక్కన పెడితే, వెళ్తూ వెళ్తూ ముగ్గురు ఇంటి సభ్యులకి ఊహించని షాక్ ఇచ్చింది. ఎలిమినేట్ అయ్యాక నాగార్జున గారు హిమజ చేత చిన్న గేమ్ ఆడించారు.


గుడ్,, బ్యాడ్, అగ్లీ అంటూ ఇంటి సభ్యులకు రేటింగ్ ఇవ్వమన్నారు. బిగ్ బాస్ హౌస్ లో వారి ప్రవర్తన, హిమజతో వారు ప్రవర్తించిన విధానం ఆధారంగా ఆమె రేటింగ్ ఇచ్చింది.  అయితే ఇక్కడ హిమజ బాబా భాస్కర్ కి అగ్లీ ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది. ఇంట్లో అందరికంటే ఎక్కువ స్ట్రాటెజీ ప్లే చేసేది బాబా భాస్కరే అంది. అలాగే సాఫ్ట్ గా కనబడే కన్నింగ్  క్యారెక్టర్ అంటూ కామెంట్స్ చేసింది.


రెండో వ్యక్తి శ్రీముఖి. శ్రీముఖికి, హిమజకి మధ్య గత కొన్ని రోజులుగా సరైన సఖ్యత లేదు. కొన్ని రోజుల క్రితం వాళ్ళు స్నేహంగా ఉన్నట్టు అనిపించినా, ఈ మధ్య వారిద్దరి మధ్య దూరం పెరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకుని హిమజ శ్రీముఖికి బ్యాడ్ ఇస్తుందని అనుకున్నారు. శ్రీముఖి కూడా తనకి ఏం ఇస్తుందో అని టెన్షన్ పడింది. అది ఆమె మిహంలో స్పష్టంగా కనబడింది. కానీ అనూహ్యంగా గుడ్ ఇచ్చేసరికి ఊపిరి పీల్చుకుంది.


శ్రీముఖి పట్ల హిమజ ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇక ముడో వ్యక్తి మహేష్. మహేష్ కి బ్యాడ్ ఇచ్చి బిగ్ బాంబ్ కూడా వేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే మహేష్ కి హిమజకి మధ్య గొడవలు జరిగిన సందర్భాలు లేవు. నామినేషన్ టైంలో మహేష్ విషయంలో తప్పు చేసిన హిమజ ఇలా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఆమె కారణాలు ఎలా ఉన్నా, ఆమె ప్రవర్తనకి ఇంటి సభ్యులు మాత్రం ఆశ్చర్యానికి లోనయ్యారు.



మరింత సమాచారం తెలుసుకోండి: