సినిమా ఇండ్రస్ట్రీలో హీరోయిన్స్‌గా రాణించిన తర్వాతే జీవితంలో పెళ్లిచేసుకుని స్దిరపడాలని అనుకుంటారు నటీమణులు. ఇక పెళ్లితర్వాత కెరియర్ క్లొజ్ అనే అభిప్రాయాలు ఎక్కువగా వినబడుతుంటాయి.అందుకే పెళ్లికి ముందే వడ్డించవలసిన అందాలను ప్రేక్షకుల ముందు ఆరబోసి.అంతో ఇంతో సంపాదించుకుని ఇక పెళ్లి చేసుకుని హాయిగా బ్రతికే హీరోయిన్స్‌ను మనం చూస్తున్నాం.ఇక పెళ్లి తర్వాత హీరోయిన్స్‌గా అన్‌ఫిట్ అనే ఇలాంటి రుమర్స్‌కు రివర్స్‌గా వెళ్లుతూ,హ్యాపిగా పెళ్లి చేసుకున్న తర్వాత హీరోయిన్‌గా రాణిస్తున్న అందాల బొమ్మ ఆకాంక్షసింగ్‌.‘మళ్లీరావా’మువీతో తెలుగు చిత్రసీమకు పరిచయమై,మళ్ళీ మళ్లీ ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఆకాంక్షసింగ్‌. అభినయప్రధాన పాత్రలో ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది.



‘దేవదాస్‌'సినిమాలో తళుక్కున మెరిసింది.ఇక ఇటీవల విడుదలైన ‘పహిల్వాన్‌'చిత్రంలో సుదీప్‌తో జతకట్టింది ఈ  సుందరి. ఇక పెళ్లి తర్వాత హీరోయిన్స్ గా రాణించరు అన్న ప్రశ్నకు సమాధానంగా,పెళ్లిచేసుకున్న తర్వాతే నేను నాయికగా వచ్చాను. ఇది తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతున్నారు.కెరీర్‌ విషయంలో నా భర్త సహకారం ఎంతో ఉంది. ఆయన అందిస్తున్న మనో ధైర్యంతోనే పరిశ్రమలో రాణించగలుగుతున్నాను.ఇక నేను 20ఏళ్ల వయసులోనే ప్రేమించి పెళ్లాడాను.నా భర్త సహకారంతో నటనలో శిక్షణ తీసుకొని పరిశ్రమలోకి అడుగుపెట్టాను.ఇక నా తెలుగు తొలిచిత్రం‘మళ్లీరావా’ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చింది.నాకు ఉత్తమ తొలి చిత్ర నాయికగా అవార్డును కూడా అందించింది.



ఒక రకంగా అది నా హృదయానికి దగ్గరైన సినిమా.నేను తెలుగులో అరంగేట్రం చేసిన తర్వాత భిన్న పార్శాలు కలిగిన పాత్రలు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా.ఇటీవల విడుదలైన ‘పహిల్వాన్‌' చిత్రంలో కథానాయికగా నటించాను. స్ఫూర్తి వంతమైన కథ కాబట్టి వినగానే వెంటనే ఓకే చెప్పాను.సుదీప్‌వంటి పెద్ద స్టార్‌తో నటించడం వల్ల ఎన్నో విషయాల్ని తెలుసుకో గలిగాను.ఇక ఇప్పుడైతే నా సినీ ప్రయాణం సంతృప్తికరంగా సాగితున్నది.తమిళం,కన్నడ భాషల్లో సినిమాలు అంగీకరించడం వల్ల తెలుగు చిత్రాల్లో నటించడం కుదరడంలేదు.ఇకపోతే పాత్రలో నవ్యత ఉంటే ఏ భాషా చిత్రంలోనైనా నటించడానికి రెడి అని పెళ్లయ్యాక నాయికగా రాణిస్తున్నా ఆకాంక్షసింగ్‌ తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: