చిరంజీవితో సమానంగా మెగా కోడలు ఉపాసనకు కూడ విపరీతమైన క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు లక్షల సంఖ్యలో ఫాలోయర్స్ ఉన్నారు. ఈమె వ్యాపారంలోనే కాకుండా తన డ్రస్సింగ్ విషయంలో కూడ ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్స్ కు అనుగుణంగా తన డ్రెస్సింగ్ స్టైల్ ను మార్చుకుని మీడియాకు హాట్ టాపిక్ గా ఉంటుంది. 

ఇలాంటి పరిస్థితులలో నిన్న జరిగిన ‘సైరా’ ఈవెంట్ కు వచ్చిన ఉపాసన డ్రెస్సింగ్ స్టైల్ చూసి కొద్దిసేపు మీడియా కెమెరాలు అన్నీ ఆమె పై ఫోకస్ పెట్టాయి. ఒకేసారి చాల కెమెరాలు తన కోడలు ఉపాసన పై దృష్టి పెట్టిన విషయాన్ని పసిగట్టిన చిరంజీవి అసలు విషయం తెలుసుకుని ఉపాసన డ్రెస్సింగ్ స్టైల్ కు ముచ్చటపడి ఆమె డ్రస్ ను చిరంజీవి తన సెల్ ఫోన్ లో ఫోటో తీయడం చూసిన వారు చాలామంది షాక్ అయ్యారు.

చిరంజీవి తన కూతుళ్ళతో సమానంగా ఉపాసనను అభిమానిస్తాడు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే అయినా ఇలా ఓపెన్ గా చిరంజీవి తన మెగా స్టార్ స్టేటస్ ను పక్కకు పెట్టి మీడియా కెమెరాలతో సమానంగా ఉపాసనాను ఫోటో తీయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై ఉపాసన స్పందిస్తూ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

‘నా ప్రియమైన మామయ్యా ‘సైరా రిలీజ్ ఈవెంట్ లో నా డ్రెస్సింగ్ స్టైల్ ను మెచ్చుకుంటూ ఫోటోలను తీసిన విషయాన్ని తెలుసుకుని పొంగిపోయాను. ఆయనలా ప్రేమించే మావగారు ఉండటం నాకు ఎంతో ఆనందం’ అంటూ తన భావాలను షేర్ చేసుకుంటూ తన డ్రెస్సింగ్ స్టైల్ కు సంబంధించిన ఫోటోను కూడ షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: