మెగాహీరో వరుణ్ తేజ్ విలన్ గా నటించిన చిత్రం "గద్దలకొండ గణేష్" సినిమా గత శుక్రవారం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. విడుదల అయిన అన్ని చోట్ల నుండి సినిమా కు మంచి ఆదరణ లభిస్తుంది.  దర్శకుడు  హరీష్ శంకర్ కు చాలా రోజుల తరువాత మంచి హిట్ వచ్చింది.వరుణ్ తేజ్ నటనపై అందరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఈ సినిమా పై దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ట్విట్టర్ ద్వారా స్పందించారు. వరుణ్ తేజ్ నటన చాలా అద్భుతంగా ఉంది. గద్దలకొండ గణేష్ పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రశంసనీయం . హరీష్ శంకర్ ఒక మంచి సినిమాను తెరకెక్కించావు. వెల్లువచ్చి గోదారమ్మ పాటకు వస్తున్న స్పందన నన్ను ఆకట్టుకుంటుంది. ఈ పాటలో పూజా హెగ్డే అద్భుతంగా చేశారని అన్నారు.

హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్  మాస్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. వరుణ్ తేజ్ పవర్ ఫుల్ డైలాగ్ డెలివరి, గెటప్ మరియు విలన్ అటిట్యూడ్ సినిమాకి  హైలెట్ గా నిలుస్తున్నాయి.   మిక్కి జె మేయర్ సినిమాకి మంచి పాటలు ఇచ్చాడు. మార్వలెస్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్  ఇచ్చాడు. అయాంక బోస్ సినిమాటోగ్రాఫి సినిమాను ఒక మెట్టు పైకి తీసుకవెళ్ళింది.


వెల్లువచ్చి గోదారమ్మ పాట సినిమాకి మరొక హైలెట్. ఈ పాటలోని   ప్రతి ఫ్రేమ్  చాలా అందంగా ఉంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు మార్వలెస్  కొరియోగ్రాఫ్ చేశాడు. ఈ పాటలో పూజా హెగ్డే అందం మరియు అభినయం రెండు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.   సినిమా రెండు రోజుల్లో దాదాపు 9.5 కోట్ల షేర్ సాధించింది. ఆదివారం కలెక్షన్స్ మరింత పెరుగుతాయని సినీ పండితుల అంచనా. సినిమాలో మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో రిపీట్ ఆడియన్స్ కూడా ఎక్కువగా వస్తారు. సైరా నరసింహారెడ్డి వచ్చే వరకు గద్దలకొండ గణేష్ కు తిరుగులేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: