మిల్కీ బ్యూటీ తమన్నాకు అందంతో పాటు అభినయం కూడా బాగానే ఉంది. దానికి తోడు ఆమెకు ఆత్మ‌విశ్వాసం కూడా చాలా ఎక్కువగా ఉంది. అందువల్లనే పదిహేనేళ్ల పాటు ఆమె టాలీవుడ్లో హీరోయిన్ గా నిలదొక్కుకుని ఉందని చెప్పాలి. టాప్ స్టార్స్ అందరి పక్కన నటించిన తమన్నా ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనూ తన డిమాండ్లు సాధించుకోవడమే విశేషం.


ఇదిలా ఉండగా తమన్నా ఈ ఏడాది మొదట్లో రిలీజ్ అయిన ఎఫ్ 2 మూవీలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పక్కన నటించింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో తమన్నా సీనియర్లకు ఫస్ట్ చాయిస్ అవుతుందని అంతా భావించారు. ఆ సినిమా తరువాత తమన్నాకు వెతుక్కుంటూ ఎన్నో అవకాశాలు వచ్చాయట. 


అందులో సీనియర్ హీరోల నుంచి ఎక్కువగా వచ్చినట్లుగా చెబుతున్నారు. సీనియర్లు తమ పక్కన జోడీగా తమన్నాను రమ్మంటున్నా కూడా ఆమె నో చెప్పేస్తోదట. ఓ సీనియర్ హీరో సినిమాలో హీరోయిన్ కోసం ఎంతో వెతికారు, తమన్నా కోసం ఎంతగానే ట్రై చేశారు. అయితే తమన్నా గట్టిగా నో చెప్పడంతో వేరే ఆప్షన్ని చివరికి వెతుక్కున్నారట.


ఇపుడు తమన్నా నటించిన మూవీ సైరా రిలీజ్ అవుతోంది. తమిళంలో ఓ మూవీలో ఆమె ఫుల్ గ్లామర్ ఒలకబొస్తోంది. బికినీలతో హాట్ హాట్ అందలను  ఆరబోస్తోంది. ఇక తెలుగులో కూడా గోపీచంద్ పక్కన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో సీనియర్ల విషయంలో తమన్నా ఎక్కడా తగ్గడంలేదని అంటున్నారు.  తాను అనుకుంటున్నట్లుగానే సీనియర్లను పక్కన పెట్టేయాలని షాకింగ్ డెసిషన్ తీసుకుందని చెబుతున్నారు. మరి ఇది కొందరికేనా, అందరికేనా అన్నది కూడా చూడాలి మరి.  ఎందుకంటే సీనియర్ల కూడా తమన్నాతో నటించాలని కోరుకునే హాట్ ఫావరేట్ హీరోలు ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: