డబ్బు డబ్బు బ్రతుకు బండిని నడిపేది డబ్బు డబ్బు అని గుండే లబ్‌డబ్ మానేసి కొట్టుకుంటుంది..ఎందుకంటే సామాన్య మానవుడు తనజీవితకాలం కూడా అంత డబ్బును సంపాధించలేడేమో అనిపిస్తుంది ఒక్కో హీరో తీసుకునే రెమ్యూనరేషన్ చూస్తుంటే.ఇక అగ్ర కథానాయికల పారితోషికాల రేంజ్ డిమాండును బట్టి..సక్సెస్ రేటును బట్టి ఉంటుందని చెప్పొచ్చు.ఐతే మన హీరోల రెమ్యూనరేషన్ గురించి  ఫిలింనగర్ లో పెట్టుకుంటున్న గుసగుసల ప్రకారం తెలిసిన వివరాలు ఇలా ఉన్నాయి..సూపర్ స్టార్ మహేష్ ఒక్కో సినిమాకి 25 కోట్ల రేంజు ఉండేది. కేవలం ఈ రెండేళ్లలోనే అతడి స్థాయి అమాంతం 50 కోట్లకు చేరిందట. పారితోషికంతో పాటు ఏరియా హక్కులు..లాభాల్లో వాటాలు అంటూ ఓవరాల్ గా అంత ముడుతుందన్న సమాచారం ఉంది.మహేష్ నటిస్తున్న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరుచిత్రానికి అన్నీ కలుపుకుని రూ.54కోట్ల పారితోషికం అందుకుంటున్నారట.



మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరి రేంజు రూ.40 కోట్ల మార్క్ ని తాకిందని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ ఇద్దరూ పాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఒక్కొక్కరు 40 కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నారని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి వరుసగా మూడు సినిమాలు క్యూలో ఉన్నాయి.వీటిలో ఒక్కో సినిమాకి రూ.25కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.బాహుబలి స్టార్ ప్రభాస్ రేంజు అనూహ్యంగా చుక్కల్ని తాకుతోంది.బాహుబలి 1-2 చిత్రాలతో పాటు సాహో లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో అతడి స్థాయి చుక్కల్ని తాకింది.సాహో చిత్రానికి యు.వి.క్రియేషన్స్ నుంచి 65కోట్ల మేర పారితోషికం అందుకుంటున్నాడని గుసగుసలు వినిపించాయి.



భారీ పాన్ ఇండియన్ సినిమా `సైరా-నరసింహారెడ్డి`చిరు-రామ్ చరణ్ ల సొంత ప్రొడక్షన్ కాబట్టి మెగాస్టార్ పారితోషికం డిమాండ్ చేయలేదట.విక్టరీ వెంకటేష్ ఒక్కో సినిమాకి 8 కోట్ల మేర పారితోషికం అందుకుంటుండగా..కింగ్ నాగార్జున రూ.6కోట్లు ..నటసింహా నందమూరి బాలకృష్ణ 6 కోట్ల మేర పారితోషికాలు అందుకుంటున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.మాస్ మహారాజ్ రవితేజ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తుండగా..ఫ్లాపుల వల్ల స్పీడ్ తగ్గి.రవితేజకు ప్రస్తుతం రూ.6కోట్లు మినిమం ముట్టజెబుతున్నారట.ఆ తర్వాత మిడ్ రేంజు హీరోలు.నాని ఒక్కో సినిమాకి రూ.12కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటుండగా..క్రేజీ హీరో విజయ్ దేవరకొండ రూ.10 కోట్ల రేంజులో పారితోషికం పుచ్చుకుంటు న్నారని ప్రచారం జరుగుతోంది.శర్వానంద్ కి ఒక్కో సినిమాకి రూ.4కోట్ల రేంజు పలుకుతోందట.అలాగే ఫిదా-తొలి ప్రేమ-ఎఫ్ 2,వాల్మీకి` లాంటి చిత్రాలతో సక్సెస్ ల పరంగా జోరు మీదున్న వరుణ్ తేజ్,పారితోషికం రేంజు రూ.5కోట్లు ఉందని తెలుస్తోంది.ఎనర్జిటిక్ హీరోగా తొలి నుంచి యువతరంలో ఫాలోయింగ్ ఉన్న రామ్ కి రూ.4కోట్ల రేంజు పారితోషికం ముడుతోందట.ఇదంతా ఫిలింనగర్ గాసిప్ రాయుళ్ల గుసగుసల్లో రెగ్యులర్ గా వినిపించే ఆసక్తికర సంగుతులు..



మరింత సమాచారం తెలుసుకోండి: