డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’. తండ్రి కలను నెరవేర్చడంలో భాగంగా చిరు తనయుడు రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బిగ్గెస్ట్ హిస్టారికల్ మూవీ ఇది. ఈ సినిమా రిలీజ్ బరిలో దిగడానికి సై అంటోంది. అక్టోబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువైన గోసాయి వెంకన్నపాత్రలో నటించారు. ఐతే తమ సినిమాలో బిగ్‌బీ  భాగం కావడాన్ని మెగాస్టార్ గౌరవంగా ఫీలవుతున్నాను అంటూ పులు సందర్భాల్లో  వెల్లడించారు. అంతేకాకుండా ప్రయాణానికి తాము ఏర్పాట్లు చేస్తామని చెప్పినా.. బిగ్ బీ తన సొంత చార్టర్ ఫ్లైట్‌లోనే షూటింగ్‌కు వచ్చే వారని.. తన సినిమాలో అమితాబ్ భాగం అవ్వడం తన అదృష్టమని చిరు సంతోషంగా చెప్పుకొచ్చారు.ఐతే.. బిగ్ బీ మాత్రం ‘సైరా’ సినిమాపై ఎప్పటినుంచో సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. అటు ఏ ఇంటర్వ్యూలో గానీ.. ఇటు తన ట్విట్టర్‌లో గానీ ఈ మూవీ గురించి అమితాబ్ స్పందించకపోవడం విశేషం.


ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ,కన్నడ భాషల్లో ఏక కాలంలో  రిలీజ్ చేయనున్నారు. ఆయా భాషల్లో క్రేజ్ తీసుకువచ్చేందకు ఇప్పటికే ఆయా భాషలకు చెందిన నటీనటులను ఈ సినిమాలో తీసుకున్నారు. ఇప్పటికే తెలుగు వెర్షన్ టీజర్‌కు పనవ్ కళ్యాన్ వాయిస్ ఓవర్ అందించారు. తమిళంలో ‘సైరా’ టీజర్‌కు రజినీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో యశ్, హిందీలో అమితాబ్ బచ్చన్ ‌తో ఈ సినిమా టీజర్‌కు వాయిస్ ఓవర్ చెప్పించనున్నట్టు సమాచారం. 


ఇదిలా ఉంటే  'సైరా' చిత్రంలో ఆయన గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్  ఇందులో నటించినందుకు గాను అమితాబ్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదట. చిత్ర నిర్మాత రాంచరణ్ ఈ విషయాన్ని చెబుతూ, 'చిరంజీవి గారితో వున్న అనుబంధం కారణంగా అమితాబ్ గారు పారితోషికం తీసుకోకుండా చేశారు' అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: