బాహుబలి ద్వారా తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి. బాలీవుడ్ సైతం నివ్వెరపోయేలా తెలుగు సినిమాను తీర్చిదిద్దిన ఘనుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం తెలుగు సినిమావైపు చూసిందంటే అతిశయోక్తి కాదు. బాహుబలి ప్రేరణతోనే తెలుగులో భారీ బడ్జెట్ లు రూపొందుతున్నాయనేది వాస్తవం. నిన్న జరిగిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఇదే మాట అన్నారు. బాహుబలి లేకపోతే "సైరా" లేదని తేల్చి చెప్పారు.


"సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా హాజరైన రాజమౌళి సైరా గురించి ఆసక్తికరంగా మాట్లాడాడు. ముఖ్యంగా సైరా  కథను అందించిన సీనియర్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ పై, అలాగే స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికిన తెలుగువాడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్రను తెలుగు ప్రజలకు చేరువ చేసిన నిర్మాత రామ్ చరణ్ పై ప్రసంశలు కురిపించారు. ఇలాంటి కథలని బయటకు తీసుకురావడం చాలా ఆవశ్యకమని చెప్పారు.


ఇంకా మాట్లాడాలని చాలా ఉన్నా, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి మహామహులు  వెనకుండగా ఏమి మాట్లాడలేమని చెప్పారు. దర్శకుడు సురేందర్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సైరా ఈవెంట్ జరుగుతున్నప్పుడు వర్షం కురిసింది. ఐతే ఆ  వర్షాన్ని ఉద్దేశిస్తూ ‘ఇందాక కురిసింది వర్షం కాదండీ, సైరా యూనిట్ పై, పైన ఉన్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి అక్షింతలు, ఆయన శుభాశీస్సులు’ అని చెప్పగానే, వెనుకనే ఉన్న చిరంజీవి ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు.


భారత తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఇ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ ౨ వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మళయాల, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి లాంటి భారీ తారాగణం ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: