మెగాస్టార్ చిరంజీవికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మధ్య బావా బామ్మర్దుల సంబంధం కంటే మించిన బంధం ఉంటుంది. చిరంజీవి కెరీర్లో బిజీ ఆర్టిస్టుగా ఉన్న సమయంలో ఇంటిని కూడా పట్టించుకునే తీరిక లేనప్పుడు అరవింద్ ఎంతో సాయం చేశాడు. చిరంజీవితో తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు కూడా నిర్మించాడు అరవింద్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వీరిద్దరి కాంబినేషన్ లో ఉన్నాయి.



2005లో వచ్చిన అందరివాడు సినిమా తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ లో ఏ సినిమా రాలేదు. చిరంజీవి కూడా తర్వాత పెద్దగా సినిమాలు చేసింది లేదు. రాజకీయాల్లోకి వెళ్లడంతో చిరంజీవి సినిమాలు కూడా తగ్గాయి. అయితే చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ నెం.150, సైరా సినిమాలు చేశాడు. నిజానికి చిరంజీవి కమ్ బ్యాక్ మూవీని అల్లు అరవింద్ నిర్మించాలని ప్రయత్నించాడు. కానీ చరణ్ సొంత బ్యానర్.. కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి సినిమా చేశాడు. చిరంజీవి 151 సినిమా అయినా చేయాలని భావించిన అరవింద్ కు మళ్లీ చరణ్ షాకిచ్చాడు. దాదాపు 250 కోట్లతో సైరా తెరకెక్కించి ఔరా అనిపించాడు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద బడ్జెట్ సినిమాను హ్యాండిల్ చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఈవెంట్ లో కూడా అరవింద్ అదే విషయాన్ని వ్యక్తం చేశాడు. చరణ్ ఈ సినిమాను ఇంత లార్జ్ స్కేల్ లో తీయడం ఆశ్చర్యం, సంతోషం కలిగించింది అన్నాడు.



చిరంజీవితో 300 కోట్ల బడ్జెట్ పెట్టడానికైనా అల్లు అరవింద్ వెనుకాడడనేది తెలిసిన విషయమే. కానీ చరణ్ హీరోగా చేస్తూ కూడా సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవడంతో అల్లు అరవింద్ కు అవకాశం రావడం లేదు. నిన్నటి అరవింద్ స్పీచ్ లో ఎటువంటి నిరాశ లేకపోయినా చిరంజీవితో సినిమా తీసే అవకాశం దక్కటం లేదనే బాధ తెలుస్తోంది. కొరటాల శివతో చిరంజీవి చేయబోయే సినిమా కూడా చరణే నిర్మిస్తూండటంతో ఇప్పట్లో అరవింద్ కు అవకాశం దక్కేలా కనిపించడం లేదు. మరి అరవింద్ అవకాశం ఎప్పుడొస్తుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: