బిగ్ బాస్ లో శనివారం రాహుల్ ని ఎలిమినేట్ చేసి ఇంటి సభ్యులకు షాక్ ఇచ్చాడు. అసలు ఎవరూ ఊహించని విధంగా రాహుల్ ఎలిమినేట్ అవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇదంతా ఫేక్ ఎలిమినేషన్ అని తేల్చేయడంతో, ప్రేక్షకులు ఊపిరి పీల్చుకున్నారు.  అయితే ఎలిమినేట్ చేసి అతన్ని సీక్రెట్ రూంలో ఉంచారు. కానీ సడెన్ గా ఈరోజు రాహుల్ మళ్ళీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాహుల్ రాకని ఊహించని హౌస్ మేట్స్ కి ఇది ఒక కుదుపనే చెప్పవచ్చు.


రాహుల్ ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే  పునర్నవిలో కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది. వరుణ్ కూడా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాడు. రాహుల్ ఎలిమినేట్ అయినప్పుడు వీరిద్దరే ఎక్కువ భావోద్వేగానికి గురయ్యారు. రాహుల్ రాక అతని మిత్ర బృందంలో సంతోషాన్ని నింపింది. అయితే  శనివారం ఎలిమినేట్ అయిన రాహుల్ కేవలం ఒక్క రోజు మాత్రమే సీక్రెట్ రూంలో ఉన్నాడు. 


మరి ఆ సీక్రెట్ రూంలో రాహుల్ ఏ విధంగా ఉన్నాడనేది తెలియదు. బిగ్ బాస్ రాహుల్ కి సీక్రెట్ గా ఏదైనా పని అప్పచెప్పి ఉంటాడని భావిస్తున్నారు. మరో పక్క రాహుల్ ని ఇంత తొందరగా ఇంట్లో ప్రవేశ పెట్టి బిగ్ బాస్ తప్పు చేశాడేమోననే వాదన వినిపిస్తుంది. కేవలం ఒకే ఒక్కరోజులో ఆయన ఆటతీరులో మార్పు వస్తుందని ఊహించలేం. అదీగాక ఈ రోజు సోమవారం కాబట్టి మళ్ళీ నామినేషన్ లోకి వచ్చే అవకాశం ఉంది.


ఒకవేళ రాహుల్ మళ్లీ నామినేషన్స్ లోకి వస్తే ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే ప్రమాదం కూడా ఉంది. అంతే కాకుండా అసలు రాహుల్ ఎలిమినేట్ అయ్యాక కంటెస్టెంట్స్ లో మార్పు వస్తుందని అనుకున్నారు.కానీ అలాంటి మార్పేమీ కనబడకుండానే మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితి ఎప్పటిలాగే ఉండే అవకాశం ఉంది. రాహుల్ ని ఒకరోజు సీక్రెట్ రూంలో ఉంచి మళ్ళీ ఇంట్లోకి ప్రవేశ పెట్టడం వల్ల ఎలాంటి లాభం చేకూరిందో బిగ్ బాస్ కే తెలియాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: