టాలీవుడ్ చరిత్రలో దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా ‘బాహుబలి, బాహుబలి 2’.  ప్రపంచ వ్యాప్తంగా బాహబలి, బాహుబలి 2 సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.  అయితే అప్పటి వరకు తెలుగు లో ఎన్నో జానపద సినిమాలు వచ్చినా..బాహుబలి, బాహుబలి 2 వ్యూజువల్ వండర్ క్రియేట్ చేసింది.  బాలీవుడ్, కోలీవుడ్ లో సైతం రికార్డులు క్రియేట్ చేసింది..అంతే కాదు భారీ కలెక్షన్లు కూడా రాబట్టింది.  తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో అభిమానుల కేరింతల మధ్య వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంతో మంది ‘సైరా’ ట్రైలర్ ని ప్రశంసిస్తూ మాట్లాడారు. 

ఇక మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి' లేకుంటే 'సైరా' లేదని మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.  పదిహేనేళ్ల క్రితం 'సైరా' సినిమా కథ, తన వద్దకు పరుచూరి బ్రదర్స్ తీసుకు వచ్చారని..తనపై రూ. 40 కోట్లు ఖర్చుతో సినిమాలు తీస్తున్న రోజుల్లోనే, 'సైరా' మూవీకికి రూ. 70 కోట్లపైనే అవుతుందన్న అంచనాలు ఉన్నాయని, అందుకే నిర్మాతలకు నష్టాలు రాకూడదన్న ఉద్దేశంతో సినిమాను పట్టాలెక్కించలేదని అన్నారు. కానీ నా మనసులో ఎప్పుడూ ‘సైరా’ పై కోరిక ఉండేదని...తెలుగు వాడు..భారత దేశంలో మొట్టమొదట స్వాతంత్ర సమరభేరి మోగించి..బ్రిటీష్ వారిని గజ గజలాడించిన గొప్ప యోధుడి కథ తెరపైకి తీసుకు వస్తే బాగుండేది అనుకునేవాడినని అన్నారు. 

అయితే ఈ మూవీ బడ్జెట్ సమస్యతో ఆగుతూ వచ్చిందన్నారు.  మొత్తానికి అన్నీ అనుకూలించి నా 151 వ సినిమా ‘సైరా’ కావడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అయితే ఈ మూవీ తెరపైకి రావడానికి ‘బాహుబలి’ కారణం అని..అప్పటి వరకు 100 కోట్ల బడ్జెట్ టాలీవుడ్ లో పెట్టవొచ్చా అన్న అనుమానాలకు బ్రేక్ పడింది. అంత గొప్ప సినిమా తీసి నిర్మాతలకు నష్టం రాకుండా సంపాదించుకోవచ్చని రాజమౌళి చేసి చూపించారు. దీంతో అధిక ఖర్చు పెట్టి రిస్క్ చేయాలని మరెవరో నిర్మాతకు చెప్పే బదులు, మనమే చేద్దామని రామ్ చరణ్ అనడంతో సరేనన్నా అని చిరంజీవి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: